Suzuki Swift CNG : భారత మార్కెట్లో అత్యధిక సంఖ్యలో కార్లను విక్రయిస్తున్న కంపెనీ మారుతీ సుజుకి.వినియోగదారులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొత్త స్విఫ్ట్ సీఎన్జీ మోడల్‌ను మారుతీ సుజుకి విడుదల చేసింది. డీజిల్ మోడళ్లను నిలిపివేసిన తర్వాత, మారుతీ సుజుకి సీఎన్జీ విక్రయాలపై దృష్టి సారించింది. 2024-25 ఆర్థిక సంవత్సరం నాటికి ఆరు లక్షల సి.ఎన్.జి వాహనాలను విక్రయించాలని మారుతి సుజుకీ లక్ష్యంగా పెట్టుకుంది. కొత్త మోడల్ అత్యంత ప్రజాదరణ పొందిన స్విఫ్ట్ మోడల్ ఈ విక్రయాలను పెంచుతుందని భావిస్తున్నారు. ఈ కారు ధర రూ.8.19 లక్షల నుంచి రూ.9.19 లక్షల వరకు ఉండనున్నాయి. స్విఫ్ట్ దాని టార్గెట్ సేల్స్ సంఖ్యను సాధించడంలో బ్రాండ్ మరింత సహాయం చేస్తుంది. ఎందుకంటే ఈ మోడల్ భారతీయ మార్కెట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన వాటిలో స్విఫ్ట్ ఒకటి. కొత్త కారు 12 అక్టోబర్ 2024 నుండి వినియోగదారులకు డెలివరీ చేస్తుంది.
మారుతి సుజుకి స్విఫ్ట్ సీఎన్జీ కిలోకు 32.85కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. పెట్రోల్ వర్షన్ మాన్యువల్ గేర్ బాక్స్ లీటరుకు 24.80 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది, అయితే ఏఎంటీ ట్రాన్స్‌మిషన్ లీటరుకు25.75 కిలోమీటర్ల అందిస్తుంది. పవర్-అడ్జస్ట్ చేయబడిన వింగ్ మిర్రర్స్, బాడీ-కలర్ వింగ్ మిర్రర్స్, డోర్ హ్యాండిల్స్, కవర్లతో కూడిన 14-అంగుళాల వీల్స్, హైట్ అడ్జస్ట్ మెంట్ డ్రైవర్ సీటు, వెనుక పార్శిల్ ట్రే, యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఉన్నాయి.
ఫీచర్లు : మారుతి సుజుకి స్విఫ్ట్ సీఎన్జీ కోసం మూడు సిలిండర్ల ఇంజన్‌ను ఇచ్చింది. ఇది 5,700 ఆర్‌పిఎమ్ వద్ద 68.79 బిహెచ్‌పి పవర్, 2,900 ఆర్‌పిఎమ్ వద్ద 101.8 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ ఇంజన్ 81బిహెచ్‌పి పవర్, 112ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. సీఎన్జీ వేరియంట్‌లో 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ లభిస్తుంది. పెట్రోల్ పవర్‌ట్రెయిన్‌తో, 5-స్పీడ్ ఏఎంటీ కూడా అందుబాటులో ఉంది. LED ఫాగ్ లైట్లు, LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, LED టైల్‌లైట్లు, 15-అంగుళాల అల్లాయ్ వీల్స్, తొమ్మిది అంగుళాల టచ్‌స్క్రీన్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రియర్ ఏసీ వెంట్స్ , ఓటీఏ అప్‌డేట్‌లు వంటి ఇతర ఫీచర్లు ఉన్నాయి.
మారుతి సుజుకి స్విఫ్ట్ సీఎన్జీ ధరలు వేరియంట్ల వారీగా (ఎక్స్-షోరూమ్)
స్విఫ్ట్ VXi CNG – రూ. 8.19 లక్షలు
స్విఫ్ట్ VXi (O) CNG – రూ. 8.46 లక్షలు
స్విఫ్ట్ ZXi CNG – రూ. 9.19 లక్షలు