Manchu Manoj : అందరూ మంచోడే అనుకుంటారు.. ఆయన బాడ్ డాడీ మంచు మనోజ్

2 Min Read

Manchu Manoj : మంచు కుటుంబానికి ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. సినీ ఇండస్ట్రీలో స్టార్ సినీ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీగా మంచు కుటుంబానికి ఎంతో మంచి పేరు ఉంది. ఇక మోహన్ బాబు వారసులుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన లక్ష్మీ మంచు ,విష్ణు, మనోజ్ ముగ్గురు కూడా విభిన్న రకాలు అని చెప్పాలి. మంచు కుటుంబ సభ్యులు ఎవరు సోషల్ మీడియాలో కానీ లేదా మీడియా ముందుకు వచ్చినా కానీ వారు చేసే వ్యాఖ్యల ద్వారా పెద్ద ఎత్తున విమర్శలను ఎదుర్కొంటూ ఉంటారు.

ఇకపోతే ఇటీవల మంచు మనోజ్ పూర్తిగా తన కెరియర్ పై ఫోకస్ పెట్టి వరుస సినిమాలలో హీరోగా అలాగే విలన్ పాత్రలలో కూడా నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మనోజ్ మంచి సక్సెస్ అందుకున్నారు అయితే ఈయన పెళ్లి చేసుకుని తన మొదటి భార్యతో విడాకులు తీసుకున్న తర్వాత వ్యక్తిగత విషయాలు ద్వారా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

Also Read : Manchu Manoj: మోహన్ బాబు యూనివర్సిటీలో ఇంత మోసమా.. నిజాలు బయటపెట్టిన మంచు మనోజ్..!

తదుపరి భూమా మౌనిక రెడ్డిని ప్రేమించడం పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం మనోజ్ ఒక బిడ్డకు తండ్రి అయ్యారు. ఇలా తన వ్యక్తిగత సమస్యలు సర్దుమనగడంతో పూర్తిగా తన కెరియర్ పైన ఫోకస్ పెట్టారు. ఇకపోతే తాజాగా మంచు మనోజ్ జీబ్రా సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సినిమాని ఓల్డ్ టౌన్ పిక్చర్స్, పద్మజ ఫిలిమ్స్ బ్యానర్స్ పై SN రెడ్డి, పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా మంచు మనోజ్ మాట్లాడుతూ ఎస్ఎన్ రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి. మంచివారికి మంచే జరగాలని కోరుకుంటాను. ఈ సినిమా కోసం అందరు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. ఇక సత్యదేవ్ కు నేను పెద్ద అభిమానిని అంటూ ఆయన పై ప్రశంసలు కురిపించారు. ఇక ఈ సినిమాలో నటించిన సత్యరాజ్ గురించి కూడా మనోజ్ మాట్లాడారు.అందరు ఆయనను గుడ్ డాడీ .. గుడ్ డాడీ అంటున్నారు. కానీ, ఆయన చాలా బ్యాడ్ డాడీ. మిమ్మల్ని ఇలా చూడడం చాలా ఆనందంగా ఉందంటూ మనోజ్ జ్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Share This Article
Exit mobile version