Manchu Manoj: సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు మంచు మనోజ్. సమాజంలో జరిగే ప్రతి దానికి స్పందిస్తూ న్యాయం కోసం పోరాడుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇదిలా ఉండగా, తన తండ్రి ఇటీవల స్థాపించిన మోహన్ బాబు యూనివర్సిటీ (ఎంబీయూ)లో విద్యార్థుల్లో జరుగుతున్న మోసాలను బయటపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అసలు విషయం ఏంటో తెలుసుకుందాం..
టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో లెజెండరీ యాక్టర్ గా, కలెక్షన్ కింగ్ గా పేరు తెచ్చుకున్న మోహన్ బాబు లెక్కలేనన్ని రికార్డులు సృష్టించాడు. సినిమాల ద్వారా పాజిటివ్ టాక్ తెచ్చుకుని విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్న మోహన్ బాబుకి ఇటీవల కాలంలో నెగెటివ్ ఇమేజ్ వస్తోందని చెప్పొచ్చు. ఆయన సినిమాలు కలెక్షన్లతో పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే మోహన్ బాబు యూనివర్శిటీ ఫీజు కలెక్షన్స్ మాత్రం నెగెటివ్ ఇమేజ్ తెచ్చిపెడుతున్నాయి. ముఖ్యంగా మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజులు, ఇతరత్రా చార్జీలు ఓ రేంజ్ లో ఉన్నాయని విద్యార్థి సంఘాలతో పాటు పేరెంట్స్ సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఈ మేరకు పేరెంట్స్ అసోసియేషన్ ఏఐసీటీకి లేఖ కూడా రాసింది. ఆ లేఖలో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆరోపణలు చేశారు. యూనివర్శిటీలో ఐటీ ఫీజులు, బిల్డింగ్ ఫీజులు, ట్యూషన్ ఫీజులు భారీగా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. యూనిఫాంలను కూడా బలవంతంగా కొనుగోలు చేస్తున్నారు. అంతేకాదు డే స్కాలర్ విద్యార్థులు కూడా తప్పనిసరిగా మెస్ లోనే భోజనం చేయాలనే షరతు కూడా ఇవ్వడంతో ఆందోళనలు ఎక్కువయ్యాయి.
ఈ విషయంపై మంచు మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ స్పందించారు. తండ్రి మంచివాడని చెబుతూనే విద్యార్థుల ఆందోళనకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. విద్యార్థుల ఆందోళనలు తనను మరింత బాధించాయన్నారు. ఈ విషయాన్ని యూనివర్సిటీ ఛాన్సలర్ మోహన్ బాబు దృష్టికి తీసుకెళ్తానని మంచు మనోజ్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. తల్లిదండ్రులకు, విద్యార్థులకు, ఏఐఎస్ఎఫ్కు పూర్తి సహకారం అందిస్తానని, అలాగే యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినయ్ని వివరణ కోరినట్లు మనోజ్ తెలిపారు.
మోహన్ బాబు పెద్ద కొడుకు విష్ణు నేతృత్వంలో మోహన్ బాబు యూనివర్సిటీ, శ్రీ విద్యానికేతన్ సంస్థలు నడుస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు రాయలసీమ విద్యార్థుల ప్రయోజనాలకే మోహన్ బాబు ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పిన మనోజ్.. వాటిని ఖండించే ప్రయత్నం చేయకుండా అన్నయ్య నిర్వహిస్తున్న విద్యాసంస్థలపై విమర్శలు చేస్తూ పోస్టులు పెడుతున్నారు. అందుకు భిన్నంగా అక్కడ ఆందోళన చేస్తున్న వారికి మద్దతు ఇస్తున్నారు అంటే మళ్లీ కుటుంబంలో విభేదాలు వచ్చినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక మంచు విష్ణు, మనోజ్ ల మధ్య గొడవ జరుగుతుందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.