మహీంద్రా తన ప్లాంట్ నుండి బయటకు వచ్చిన మొదటి థార్ రాక్స్‌ను వేలం వేయనుంది. రాక్స్ సిరీస్ లో తయారు చేసిన మొదటి మహీంద్రా థార్ వెహికల్ నంబర్ (VIN) ‘0001’. దీని విక్రయానికి వేలం రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. ఈ ఆఫ్-రోడ్ ఎన్ యూవీ బుకింగ్ అక్టోబర్ 3 నుండి ప్రారంభమవుతుంది. కంపెనీ మొదటి మహీంద్రా థార్ 3-డోర్‌ను కూడా వేలం వేసింది. దీనికి అత్యధికంగా రూ.1.11 కోట్ల బిడ్ వచ్చింది. వేలంలో థార్ రాక్స్ కూడా మంచి మొత్తానికి అమ్ముడు పోవచ్చని అంచనా వేస్తున్నారు. థార్ రాక్స్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 12.99 లక్షలు.
2024 మహీంద్రా థార్ రాక్స్ ఎక్స్-షోరూమ్ ధరలు
వేరియంట్లు 2.0-లీటర్ టర్బో పెట్రోల్ 2.2-లీటర్ డీజిల్
MX1 రూ. 12.99 లక్షలు (MT) రూ. 13.99 లక్షలు (MT)
MX3 రూ. 14.99 లక్షలు (AT) రూ. 15.99 లక్షలు (MT)
రూ. 17.49 లక్షలు (AT)
MX5 రూ. 16.49 లక్షలు (MT)
రూ. 17.99 లక్షలు (AT) రూ. 16.99 లక్షలు (MT)
రూ. 18.49 లక్షలు (AT)
AX3L రూ. 16.99 లక్షలు (MT)
AX5L రూ. రూ.18.99 లక్షలు (AT)
AX7L రూ. 19.99 లక్షలు (AT) రూ. 18.99 లక్షలు (MT)
రూ. 20.49 లక్షలు (AT)
థార్ రాక్స్ బేస్ వేరియంట్ MX1. ఈ కారు చాలా అద్భుత ఫీచర్లను కలిగి ఉంటుంది. దీని అన్ని ఫీచర్ల వివరాలను తెలుసుకోవాలంటే మరికొంత కాలం వేచి ఉండాలి. థార్ రాక్స్‌లో బలమైన భద్రతా ఫీచర్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఇది 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఇది గరిష్టంగా 162హెచ్ పీ శక్తిని, 330ఎన్ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో మరొక డీజిల్ ఆఫ్షన్ కూడా అందుబాటులో ఉంది. ఇది 2.2-లీటర్ డీజిల్ ఇంజన్, ఇది గరిష్టంగా 152హెచ్ పీ శక్తిని, 330ఎన్ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్లు మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తాయి.
6 ఎయిర్‌బ్యాగ్‌లు, 3-పాయింట్ సీట్ బెల్ట్‌లు
థార్ రాక్స్ సేఫ్టీ ఫీచర్ల వివరాలను ఇంకా వెల్లడించలేదు. ఇది కెమెరా ఆధారిత లెవల్-2 ఏడీఏఎస్ సూట్‌తో అందించబడింది. నాలుగు చక్రాలకు డిస్క్ బ్రేక్‌లు, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ప్రయాణీకులందరికీ 3-పాయింట్ సీట్ బెల్ట్‌లు, TCS, TPMS, ESP SUV కొన్ని ఇతర సెక్యూరిటీ ఫీచర్లు.