Mahesh Babu: టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న మహేష్ బాబు ఒకవైపు వరుస సినిమాల్లో నటిస్తూనే మరోవైపు వ్యాపార రంగంలోనూ దూసుకుపోతున్నాడు. వస్త్ర రంగంలోకి అడుగుపెట్టిన ఆయన మల్టీప్లెక్స్ సినిమాల రంగంలో కూడా దూసుకుపోతున్నారు. అంతేకాదు పలు పెద్ద నగరాల్లో మల్టీప్లెక్స్ లను నిర్మించి భారీగా ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మహేష్ బాబు జాతీయ స్థాయిలో 8వ స్థానం దక్కించుకున్నాడు. ఏ రంగంలో ఆయనకు ఈ గుర్తింపు లభించిందో చూద్దాం.
సూపర్ స్టార్ మహేష్ బాబు సొంత థియేటర్ ఏఎంబీ సినిమాస్ మరో ఘనత సాధించింది. జియోఐక్యూ నివేదిక ప్రకారం.. దేశంలో ప్రతిరోజూ అత్యధికంగా సందర్శించే మాల్స్‌లో ఒకటిగా దీనిని ప్రకటించింది. ఈ నివేదికలో హైదరాబాద్‌లోని శరత్ సిటీ క్యాపిటల్ మాల్ జాతీయ స్థాయిలో 8వ స్థానంలో నిలిచింది. ఈ మాల్‌లో మహేష్ బాబు ఏఎంబీ సినిమాస్ థియేటర్ కూడా ఉండడం గమనార్హం.
శరత్ సిటీ క్యాపిటల్‌లోని ఏఎమ్‌బి సినిమాస్‌ను పెద్ద సంఖ్యలో ప్రజలు, సినీ అభిమానులు సందర్శిస్తారని నివేదిక వెల్లడించింది. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని టాప్ సినిమా మల్టీప్లెక్స్‌లలో ఏఎంబీ సినిమాస్ మొదటి స్థానంలో నిలిచిందని సమాచారం.ఈ శరత్ సిటీ మాల్‌లో పిల్లల నుండి స్త్రీలు, పురుషుల వరకు దుస్తులతో పాటు యాక్సెసిరీస్, ఆర్నమెంట్స్ ఇలా మనకు కావలసినవన్నీ ఉన్నాయి. ఈ మాల్ దాదాపు 8 అంతస్తులతో కూడిన మినీ సైజ్ చార్మినార్ అనడంలో సందేహం లేదు.
ముఖ్యంగా చార్మినార్ లో లభించే ప్రతి వస్తువు ఇక్కడే కాకుండా అత్యంత నాణ్యతతో, అతి తక్కువ ధరకు లభిస్తుందని ఈ మాల్ ను సందర్శించిన వారు చెబుతున్నారు. ఈ మాల్ ప్రత్యేకతల విషయానికి వస్తే, ఇది 1,931,000 చదరపు అడుగుల రిటైల్ మాల్ స్థలాన్ని కలిగి ఉంటుంది. నాలుగు అంతస్తులలో 1400 కార్లు, 4000 బైక్‌లను పార్కింగ్ చేయడానికి కూడా స్థలం ఉంది. ఆహారం, కిరాణా, డిజిటల్, ఫ్యాషన్, పాదరక్షలు, గృహోపకరణాలు, బహుమతి వస్తువులు, పిల్లల కోసం వినోదం, సాహసం అన్నీ ఇక్కడ ఏర్పాటు చేయబడ్డాయి.
ఇక్కడ మనకు కావలసినవన్నీ కనుగొనవచ్చు. పిల్లలు, పెద్దల కోసం ఇండోర్ గేమ్‌లు కూడా ఉన్నాయి. ఇక్కడ సుమారు 430 బ్రాండ్‌ల వస్తువులు, దుస్తులను సొంతం చేసుకోవచ్చు. ఈ మాల్ చాలా ప్రజాదరణ పొందింది. ఎందుకంటే ప్రజలు తమకు అవసరమైన ప్రతిదాన్ని ఒకే చోట సులభంగా కనుగొనవచ్చు. అందుకే జాతీయ స్థాయిలో 8వ స్థానం సాధించడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న మహేష్ బాబు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.