KTR : అమృత్ టెండర్లలో భారీ కుంభకోణం జరిగిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆరోపించారు. ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సీఎం రేవంత్ పై మండిపడ్డారు. అమృత్ టెండర్ల అవినీతిపై అన్ని ఆధారాలు ఉన్నాయని కేటీఆర్ స్పష్టం చేశారు. బావ మరిదికి అమృతం పంచారని మండిపడ్డారు. శోద కంపనికి అమృత్ ను పంచిపెట్టారని తెలిపారు. రేవంత్ రెడ్డికి బామ్మర్ది కావడమే సృజన్ రెడ్డి అర్హత అన్నారు. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు ఫిర్యాదు చేశామన్నారు.
కేంద్ర ప్రభుత్వ డబ్బులకు రాష్ట్రం టెండర్లు పిలిచింది.. వివరాలు ఎక్కడా లేవన్నారు. ముఖ్యమంత్రి బామ్మర్దిని అధికారులు కాపాడుతున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి బమ్మర్ధికి అమృతం పంచి.. కొడంగల్ వాసులకు ఫార్మా పేరుతో విషం పంచుతున్నారని తెలిపారు. అల్లుడు కోసం కొడంగల్ ను బలి పెడుతున్నారని మండిపడ్డారు. ప్రజల తిరుగుబాటు మొదలయిందన్నారు. తెలంగాణ లో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని తెలిపారు.
Also Read : KTR: సమంత నాగచైతన్య విడాకులకు కేటీఆర్ కారణం.. మంత్రి సురేఖ హాట్ కామెంట్స్!
KTR Alleges Corruption in Amrit Tenders: Evidence Against Shodha Company’s Eligibility
మహారాష్ట్ర ఎన్నికల కోసం తెలంగాణ సర్కార్ 300 కోట్ల రూపాయలతో యాడ్స్ ఇచ్చారని గుర్తుచేశారు. రాహుల్ గాంధీ తెలంగాణా కు వచ్చి మహిళలను కలవాలి.. వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. మహారాష్ట్రలో చేస్తున్న తెలంగాణ ప్రచారంలో అన్ని అపద్దాలే అన్నారు. తెలంగాణా ఎటిఎం అయితే.. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందని మండిపడ్డారు. బీజేపీ డిల్లీ నేతలే తెలంగాణ కాంగ్రెస్ కు ఎటిఎం గా మారిందని ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాబినెట్ సమావేశాల్లో కూర్చున్న వాళ్ళకే టెండర్లు ఎలా ఇస్తారు.. తమ వాళ్లకు ఎలా మేలు చేస్తారని ప్రశ్నించారు కేటీఆర్.
ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద ఎందరో ఇప్పటికే తమ పదవులు కోల్పోయారన్నారు. అలా తెలంగాణలో కూడా పదవులు కోల్పోతారన్నారు. మహరాష్ట్ర , తెలంగాణ మధ్య డబ్బుల వరద పారుతోంది .. ఎన్నికల సంఘం నిఘా పెంచాలన్నారు. వసూళ్లు, బెదిరింపులు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి.. RR టాక్స్ వసూలు చేస్తున్నారు.. ఈ మాటలు ప్రధాని మాట్లాడినవే.. మరి కేంద్రంలో అధికారంలో ఉన్న మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారన్నారు.
కొడంగల్ కు సెక్యూరిటీ లేకుండా అధికారులు వెళ్లే పరిస్థితులు అని కేటీఆర్ మండిపడ్డారు. ఇతర శాఖల అవినీతిపై ధారావాహికలు ప్రసారం చేస్తాం.. డిల్లీకి వస్తూ ఉంటాం.. వాస్తవాలు బయట పెడతామన్నారు. రేవంత్ ను మేం విమర్శిస్తే బీజేపీ ఎంపీలే రక్షణ కవచంగా మారుతున్నారన్నారు. తెలంగాణ లో 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పది మంది బయటకు వచ్చి ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలన్నారు. దేశంలో ఎమ్మెల్యేలను కొంటుంది తెలంగాణలో.. కాంగ్రెస్ అధ్యక్షుడు తెలంగాణకు వచ్చి చూడాలన్నారు. మహారాష్ట్ర ఓటర్లు కాంగ్రెస్ బీజేపీల కు ఓటు వేయొద్దన్నారు. ప్రాంతీయ పార్టీలను బలోపేతం చెయ్యాలన్నారు. ప్రాంతీయ పార్టీలకు ఓటేయ్యాలని పిలుపునిచ్చారు. తెలంగాణా లో ఓడిపోయాం.. ఎక్కడ ఓడామో .. అక్కడ గెలిచాకే ఇతర రాష్ట్రాల పై ఫోకస్ చేస్తామని కేటీఆర్ తెలిపారు.