Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా నటుడుగా ఇండస్ట్రీలో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న అల్లు అర్జున్ త్వరలోనే పుష్ప 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా డిసెంబర్ ఆరో తేదీ విడుదలకు సిద్ధమవుతోంది. నిజానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా షూటింగ్ ఆలస్యం కావడంతో సినిమా విడుదల కూడా వాయిదా పడుతూ వస్తుంది.
ఇక ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ ఎవరితో సినిమా చేస్తారనే విషయంపై ఇంకా క్లారిటీ అయితే రాలేదు. ఇకపోతే ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్లో దేవర సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా సెప్టెంబర్ 27న విడుదల కానున్న నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కొరటాల అల్లు అర్జున్ (Allu Arjun) తో సినిమా చేయడం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Also Read : Kajal Agarwal తో రొమాన్స్… భయపడిన స్టార్ హీరో.. ఎవరంటే?
Koratala Confirms Movie with Allu Arjun Exciting News for Fans
ఈ సందర్భంగా కొరటాల శివ మాట్లాడుతూ అల్లు అర్జున్ తో (Allu Arjun ) తప్పకుండా సినిమా ఉంటుందని కామెంట్ చేయడంతో బన్నీ ఫాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాను మిర్చి సినిమా చేసిన తర్వాత అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో కలిసి ఈ సినిమా చూశారట. అయితే తన ఫ్యామిలీ మొత్తం ఈ సినిమాని బాగా ఎంజాయ్ చేశారని అల్లు అర్జున్( ఒక సందర్భంలో తన వద్ద చెప్పారు. అప్పటినుంచి మేమిద్దరం కలిసి ఒక సినిమా చేయాలని భావించాము అయితే ఆరోజు అతి తొందరలోనే వస్తుందని ఆశిస్తున్నాను అంటూ ఈ సందర్భంగా కొరటాల శివ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇక దేవర సినిమాకు సంబంధించి ఒక చిన్న లైన్ నా దగ్గర ఉండేది ఆ లైన్ ఆచార్య సినిమా కంటే ముందుగానే ఎన్టీఆర్ తో చెబితే చాలా బాగా ఉందని చెప్పారు. అదే ఇప్పుడు మెటరీయలైజ్ అయిందని కొరటాల తెలిపారు. ఇక నా దగ్గర ఎలాంటి చిన్న కథలు ఉన్న లేదా సినిమాకి సంబంధించి ఒక చిన్న పాయింట్ ఉన్న కచ్చితంగా ఎన్టీఆర్ తో షేర్ చేసుకుంటాను. ఇక చిన్న చిన్న కథలను కూడా ఎన్టీఆర్ చాలా బాగా ఇష్టపడుతూ నేను ఈ సినిమాలో నటిస్తానని చెబుతారు. ఆ సమయంలో ఊరుకోండి స్వామి మీకి ఈ కథ సరిపోదు కానీ అని నేనే చెబుతూ ఉంటానని ఈ సందర్భంగా కొరటాల చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.