Devara 2 : దేవర 2 పై క్లారిటీ ఇచ్చిన కొరటాల… షూటింగ్ ప్రారంభమై ఏది అప్పుడేనా?

2 Min Read

Devara 2 : కొరటాల శివ గత కొన్ని సంవత్సరాలుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో రచయితగా పనిచేస్తూ ఉన్నారు. ఇలా రచయితగా పనిచేస్తున్న కొరటాల శివ మిర్చి సినిమా ద్వారా దర్శకుడిగా మారిపోయారు మొదటి సినిమాతోనే దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన అనంతరం శ్రీమంతుడు, భరత్ అనే నేను, జనతా గ్యారేజ్ వంటి సూపర్ హిట్ సినిమాల ద్వారా దర్శకుడిగా పేరు ప్రఖ్యాతలు పొందారు.

ఈ విధంగా కొరటాల అంటే అపజయం ఎరుగని దర్శకుడుగా పేరుపొందారు కానీ ఈయన ఆచార్య సినిమాతో భారీ డిజాస్టర్ ఎదుర్కోవలసి వచ్చింది. ఇలాంటి ఒక డిజాస్టర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ తో కలిసి దేవర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీ విడుదల కాబోతోంది. ఎన్టీఆర్ సోలో హీరోగా నటించి ఆరు సంవత్సరాల అవుతున్న తరుణంలో ఈ సినిమా కోసం అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Also Read : Devara సినిమా చూసేవరకు నన్ను బతికించండి.. ఎన్టీఆర్ అభిమాని ఎమోషనల్ కామెంట్స్!

clarity about Devara 2 Shooting date

ఇక ఈ సినిమా మరికొద్ది రోజులలో విడుదల కాబోతున్న నేపథ్యంలో కొరటాల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా సీక్వెల్ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. దేవర సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. మరి దేవర సీక్వెల్ ఎప్పుడు ఉంటుంది అనే ప్రశ్న ఈయనకు ఎదురయింది. ఈ ప్రశ్నకు కొరటాల సమాధానం చెబుతూ నేనైతే వెంటనే దేవర 2(Devara 2) సినిమా చేయాలనే ఆలోచనలోనే ఉన్నాను అందుకే నటీనటులతో వారి కాల్ షీట్స్ గురించి చర్చలు జరుపుతున్నానని తెలిపారు. అందరికీ వీలైతే వెంటనే ఈ సినిమా మొదలవుతుందని లేదంటే మరో కొత్త సినిమా పూర్తి చేసిన తర్వాత దేవర 2 పనులు మొదలు పెడతామంటూ ఈ సందర్భంగా కొరటాల శివ వెల్లడించారు.

ఇక దేవర విడుదలైన వెంటనే ఎన్టీఆర్ తదుపరి ప్రశాంత్ నీల్ సినిమా పనులలో బిజీ కాబోతున్నారు. ఈ సినిమా పనులలో బిజీగా మారితే బహుశా దేవర 2 కి కాల్ షీట్స్ ఇచ్చే అవకాశాలు ఏమాత్రం ఉండవని తెలుస్తోంది. దీన్నిబట్టి చూస్తుంటే దేవర 2 సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి కాస్త ఆలస్యం అయ్యేలాగే ఉందని పలువురు భావిస్తున్నారు.

Share This Article