Allu Arjun : నా ఆఫీసులోకి అడుగుపెట్టగానే ఆయన ఫోటోనే కనిపిస్తుంది.. ఈ గుర్తింపు తనకే సొంతం

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు. ఇటీవల ఈ ఎపిసోడ్ ప్రసారం అయింది అయితే ఇందులో భాగంగా బాలకృష్ణ ఎన్నో వృత్తిపరమైన, వ్యక్తిగతమైన విషయాల గురించి అల్లు అర్జున్ ని ప్రశ్నించారు. అల్లు అర్జున్ కెరియర్లో ముఖ్యమైన వాళ్లతో వీడియో బైట్స్ తీయించి, షోలో ప్లే చేయడం జరిగింది.

ఇక ఈ వీడియోలో భాగంగా గుణశేఖర్, రాఘవేంద్రరావు, త్రివిక్రమ్ శ్రీనివాస్, దిల్ రాజు వంటి వారు అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ ఎన్నో విషయాలను తెలిపారు. ఇక అల్లు అర్జున్ సినీ కెరియర్లో డైరెక్టర్ రాఘవేంద్రరావు గారికి ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పాలి. ఎన్నో అద్భుతమైన సినిమాలకు దర్శకత్వం వహించిన రాఘవేంద్రరావు తన 100 వ సినిమాగా గంగోత్రి సినిమాని తెరకెక్కించారు.

Also read : Pushpa 2: అసలు కథ పుష్ప 2 లోనే ఉంది.. అంచనాలను పెంచేసిన అనసూయ!

ఈ సినిమా రాఘవేంద్రరావుకి 100వ సినిమా అల్లు అర్జున్ (Allu Arjun) కి మొదటి సినిమా కావటం విశేషం ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో అల్లు అర్జున్ తదుపరి అవకాశాలను అందుకొని ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక రాఘవేంద్రరావు ఈ వీడియోలో గంగోత్రి సినిమా గురించి మాట్లాడుతూ తగ్గేదేలే అంటూ అల్లు అర్జున్ ఆల్ ద బెస్ట్ తెలిపారు. ఈ వీడియో అనంతరం రాఘవేంద్రరావు గురించి అల్లు అర్జున్ మాట్లాడారు.

రాఘవేంద్రరావు గారి గురించి ఎంత మాట్లాడినా తక్కువే అందుకే నేను నా ఆఫీసులో ఆయన పెద్ద ఫోటో పెట్టించానని ఎవరైనా నా ఆఫీసులోకి అడుగు పెట్టగానే మొదట రాఘవేంద్రరావు గారి ఫోటో కనిపిస్తుందని బన్నీ తెలిపారు. ఇక ఆ ఫోటో కింద నా ఫస్ట్ డైరెక్ట్ అని కూడా రాయించాను. ఆయనకు నా మనసులో ఎంతో స్థానం ఉంది కాబట్టే తన ఫోటోని నా ఆఫీసులో పెట్టుకున్నానని ఇప్పుడు నేను పొందిన ఈ గుర్తింపు అంతా కూడా ఆయనకే సొంతమని తెలిపారు. చిన్నప్పుడు నేను డాన్స్ చేస్తుంటే ఆయన పిలిచి నాకు వంద రూపాయల అడ్వాన్స్ ఇచ్చి హీరోగా ఆ రోజే కన్ఫామ్ చేసుకున్నారని తెలియజేశారు. ఇక నాడు ఆయన నాకు ఇండస్ట్రీలో స్థానం కల్పించి, ప్రోత్సహించారు కాబట్టే ఇప్పటికీ ఆయనను నేను మర్చిపోలేను. అందుకే ఆయన ఎప్పటికీ నా గుండెల్లో నిలిచిపోతారని తెలియచేశారు.

Share This Article
Exit mobile version