మోక్షజ్ఞ కోసం కత్తిలాంటి ఫిగర్ ను సెట్ చేసిన బాలయ్య!

2 Min Read

Mokshagna: నందమూరి మోక్షజ్ఞ త్వరలోనే హీరోగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు అయితే ఈయన సినిమాని ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. మోక్షజ్ఞ హీరోగా రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. ఈ పోస్టర్ నందమూరి అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాకు సుధాకర్ చెరుకూరి తేజస్విని నందమూరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఇక ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో అంటేనే ఈ సినిమాపై అంచనాలు కూడా పెరిగిపోయాయి.

ఇదిలా ఉండగా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే విషయం గురించి రోజుకు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇన్ని రోజులు ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాలో నార్త్ హీరోయిన్ అయితే బాగుంటుందనే ఆలోచనలో చిత్ర బృందం ఉందని వార్తలు వినిపించాయి. అంతేకాకుండా ఈ సినిమాకు శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషి కపూర్ హీరోయిన్ గా ఎంపికయ్యారు అంటూ వార్తలు వచ్చాయి.

ఇప్పటివరకు ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే విషయం గురించి కూడా ఎలాంటి ప్రకటనలు వెలువడ లేదు కానీ మోక్షజ్ఞ కోసం బాలకృష్ణ ఒక కత్తిలాంటి అమ్మాయిని సెలెక్ట్ చేశారని తెలుస్తుంది. తన కొడుకు మొదటి సినిమా విషయంలో బాలకృష్ణ చాలా జాగ్రత్తగా అన్ని వ్యవహారాలను చూసుకుంటూ ఉన్నారట. ఈ క్రమంలోనే మోక్షజ్ఞ కోసం మన టాలీవుడ్ ఇండస్ట్రీలో గ్లామర్ డాల్ గా గుర్తింపు పొందిన శ్రీ లీలను బాలయ్య ఎంపిక చేశారు అంటూ మరోసారి శ్రీలీల పేరు కూడా తెరపైకి వచ్చింది.

శ్రీ లీల మోక్షజ్ఞ కాంబినేషన్ చూడ ముచ్చటగా ఉంటుందని అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాలి అంటే చిత్ర బృందం అధికారకంగా ప్రకటించే వరకు మనం ఎదురు చూడాల్సిందే.

Share This Article
Exit mobile version