Ntr: ఫ్లెక్సీలు కట్టడం కోసం ముందుగానే ప్లేస్ రిజర్వేషన్స్ .. ఆ మాస్ హీరో ఎవరో తెలుసా?

2 Min Read

Ntr: ఒక స్టార్ హీరో సినిమా విడుదల అవుతుంది అంటే అభిమానులు చేసే హంగామా ఎలా ఉంటుందో మనకు తెలిసిందే. సినిమా విడుదలకు ముందు నుంచే కూడా థియేటర్ల వద్ద పెద్ద ఎత్తున సందడి చేస్తూ ఉంటారు. తమ అభిమాన హీరో సినిమాకు సంబంధించి భారీ కటౌట్లను ఏర్పాటు చేస్తూ సందడి చేస్తూ ఉంటారు. ఇలా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఎంతోమంది హీరోలు భారీ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నారు.

ఇక స్టార్ హీరో సినిమా విడుదలవుతుంది అంటే థియేటర్ల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం సర్వసాధారణం కానీ ఫ్లెక్సీలను కట్టడం కోసం కూడా ముందుగానే ప్లేసులను రిజర్వేషన్ చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఇలా ముందుగానే ఫాన్స్ అందరూ ఫ్లెక్సీలు కట్టడం కోసం రిజర్వేషన్లు చేసుకుంటున్నారు అంటే ఆ స్టార్ హీరో క్రేజ్ ఎలా ఉందో స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఏ హీరో అభిమానులు ముందుగానే ప్లేసులు రిజర్వేషన్ చేసుకుంటున్నారనే విషయానికి వస్తే ఆయన మరెవరో కాదు టాలీవుడ్ స్టార్ హీరో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ అని చెప్పాలి.

ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా సెప్టెంబర్ 27వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా విడుదలకు ఇంకా 15 రోజుల సమయం ఉన్న నేపథ్యంలో అభిమానుల సందడి కూడా మొదలైంది. అయితే కొన్ని ప్రాంతాలలో అభిమానులు ఈ సినిమా ఫ్లెక్సీలను కట్టడం కోసం ముందుగానే ప్లేసులను రిజర్వేషన్ చేసుకుంటున్నటువంటి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ఎన్టీఆర్ క్రేజ్ చూసిన ఇతర అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.

ఇక ఎన్టీఆర్ రాజమౌళి డైరెక్షన్లో నటించిన RRR సినిమా తరువాత దేవర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కొరటాల డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మొదటి భాగం సెప్టెంబర్ 27న విడుదల కానుంది. ఇందులో సీనియర్ దివంగత నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

TAGGED:
Share This Article
Exit mobile version