JEEP India : జీప్ ఇండియా ఇటీవల తన 2025 మెరిడియన్ ఎస్ యూవీని విడుదల చేసింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.24.99 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. అంతే కాదు, ఈ ఎస్ యూవీ పై కంపెనీ భారీ డిస్కౌంట్లను కూడా ఇస్తోంది. ఈ తగ్గింపులు కేవలం ప్రీ-అప్డేట్ మోడల్లకు మాత్రమే పరిమితం కాకుండా, కొత్తగా ప్రారంభించిన మెరిడియన్ వెర్షన్లపై కూడా ఉన్నాయి.
2025 మెరిడియన్‌పై కంపెనీ రూ. 30,000 వరకు తగ్గింపును అందిస్తోంది. భారతదేశంలో ఇది మహీంద్రా XUV700, టాటా సఫారి, వోక్స్వ్యాగన్ టిగువాన్, ఎంజీ గ్లోస్టర్, హ్యుందాయ్ టక్సన్ , టయోటా ఫార్చ్యూనర్లతో పోటీపడుతుంది.మరోవైపు, ప్రీ-అప్డేట్ చేయబడిన మెరిడియన్ మిగిలిన స్టాక్‌పై రూ. 1.35 లక్షల వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి.
Also Read : upcoming sedan cars :త్వరలో మార్కెట్లోకి.. ఔరా అనిపించే మూడు సెడాన్ కార్లు
JEEP India Offers ₹1.35 Lakh Discount on SUV Variants– Don’t Miss Out on the New Model Deal!
ఈ ప్రయోజనాలలో రూ. 80,000 వరకు నగదు తగ్గింపు (వేరియంట్‌ను బట్టి), రూ. 30,000 వరకు లాయల్టీ బోనస్, రూ. 25,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ ఉన్నాయి. ఈ కారు 6-స్పీడ్ మాన్యువల్, 9-స్పీడ్ టార్క్ కన్వర్టర్ యూనిట్‌తో జత చేయబడిన 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్‌ను పొందుతుంది.
జీప్(JEEP India) మెరిడియన్ ప్రస్తుతం నాలుగు వేరియంట్లలో విక్రయానికి అందుబాటులో ఉంది. అవి లాంగిట్యూడ్, లాంగిట్యూడ్ ప్లస్, లిమిటెడ్ (O) , ఓవర్‌ల్యాండ్. దాని లాంగిట్యూడ్ వేరియంట్ ధర రూ. 24.99 లక్షల నుండి రూ. 28.49 లక్షలు, లాంగిట్యూడ్ ప్లస్ ధర రూ. 27.50 లక్షల నుండి రూ. 30.49 లక్షల మధ్య, లిమిటెడ్ (ఓ) ధర రూ. 30.49 లక్షల నుండి రూ. 34.49 లక్షల మధ్య ఉంటుంది. అయితే, ఓవర్‌ల్యాండ్ వేరియంట్ ధర రూ. 36.49 లక్షల నుండి రూ. 38.49 లక్షల వరకు ఉంటుంది.
ఇప్పుడు కొత్త జీప్ మెరిడియన్ ఫీచర్ల గురించి చెప్పాలంటే.. ఇందులో ఫ్రీస్టాండింగ్ 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్, 10.2-అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. కారులో లెదర్‌తో చుట్టబడిన స్టీరింగ్ వీల్, వైర్లెస్ ఛార్జర్, 9-స్పీకర్ ఆల్పైన్ సౌండ్ సిస్టమ్ ఉన్నాయి. టాప్-స్పెక్ ఓవర్‌ల్యాండ్ ఇప్పుడు 11 కంటే ఎక్కువ ఫీచర్లతో అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్ట్ సిస్టమ్ (ADAS) సూట్‌ను, భద్రత కోసం అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్‌తో పాటు అధునాతన యుకనెక్ట్ టెక్నాలజీని పొందుతుంది.