Jani Master : ఒక్క పాటకు జానీ మాస్టర్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా.. కెరియర్ నాశనం చేసుకున్నారా?

2 Min Read

Jani Master: ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రాఫర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో జానీ మాస్టర్ ఒకరు. కొరియోగ్రాఫర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈయన భాషతో సంబంధం లేకుండా సౌత్ సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలకు పని చేస్తూ మంచి సక్సెస్ అయ్యారు. అయితే ఇటీవల ఈయన లైంగిక వేధింపుల కేసులో చిక్కుకోవడంతో ఈయన కెరియర్ పై భారీ స్థాయిలో దెబ్బ పడిందని చెప్పాలి.

తన అసిస్టెంట్ ఈయనపై లైంగిక ఆరోపణలు చేయడమే కాకుండా పోలీస్ కేసు నమోదు చేయడంతో జానీ మాస్టర్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని 14 రోజులపాటు కస్టడీ విధించారు. ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నటువంటి జానీ మాస్టర్ కు సంబంధించి ఎన్నో వార్తలు బయటకు వస్తున్నాయి.. అయితే కెరియర్ పరంగా మంచి సక్సెస్ అయిన జానీ మాస్టర్ ఈ వివాదం కారణంగా ఎన్నో ఇబ్బందులను కూడా ఎదుర్కోబోతున్నారని ముందు ముందు ఈయనకు ఇండస్ట్రీలో అవకాశాలు రావడం కూడా కష్టమేనని తెలుస్తోంది.

ఇలా స్టార్ కొరియోగ్రాఫర్ గా స్టార్ హీరోల సినిమాలలో పనిచేసిన ఈయన ఒక్కో పాటకు భారీ స్థాయిలోనే రెమ్యూనరేషన్ అందుకునే వారని తెలుస్తుంది. జానీ మాస్టర్ ఒక పాటకు కనుక కొరియోగ్రఫీ చేస్తే సుమారు 50 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారట అయితే ఈయన పని తీరును బట్టి కొంతమంది దర్శక నిర్మాతలు సినిమాలోని అన్ని పాటలకు కూడా ఈయనకే కొరియోగ్రఫీ చేసే అవకాశాన్ని కూడా కల్పించిన సందర్భాలు ఉన్నాయని చెప్పాలి.

ఈ విధంగా కొరియోగ్రాఫర్ గా సక్సెస్ అయినటువంటి జానీ మాస్టర్ మరోవైపు బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేసేవారు. ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ డాన్స్ షో కార్యక్రమంలో ఈయన జడ్జిగా వ్యవహరిస్తూ సందడి చేశారు. ఇక ఈయన అరెస్ట్ అయిన తర్వాత ఎన్నో విస్తూ పోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. జానీ మాస్టర్ సతీమణి సుమలత సైతం సదరు అసిస్టెంట్ పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.

TAGGED:
Share This Article
Exit mobile version