Janhvi Kapoor : చచ్చినా అలాంటి పాత్రలు చేయను… అమ్మ మాటే వేదవాక్కు

2 Min Read

Janhvi Kapoor : బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతున్నటువంటి నటి జాన్వీ కపూర్ దేవర సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇలా మొదటి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ధడక్ సినిమా ద్వారా హీరోయిన్ గా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె ఇప్పటివరకు కేవలం బాలీవుడ్ సినిమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేశారు.

ఇక శ్రీదేవి వారసురాలు తెలుగులో నటిస్తే చూడాలని ఎంతోమంది తెలుగు అభిమానులు కూడా ఆతృత కనబరిచారు. ఇక ఈమె దేవర సినిమాలో కనిపించినది కొంతసేపే అయినప్పటికీ కూడా తన నటనతో అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకొని మరోసారి తన తల్లిని గుర్తు చేశారని చెప్పాలి. ఇకపోతే దేవర సినిమా ప్రమోషన్లలో భాగంగా పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలలో పాల్గొన్న జాన్వీ కపూర్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.

Also Read : Devara సినిమా చూసేవరకు నన్ను బతికించండి.. ఎన్టీఆర్ అభిమాని ఎమోషనల్ కామెంట్స్!

janhvi kapoor statements

ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ తాను సినిమాలలో ఎలాంటి పాత్రలలో అయినా నటిస్తాను కానీ జుట్టు లేకుండా నటించే పాత్రలు అంటే మాత్రం చచ్చినా నటించననీ తెలిపారు. నేను చేసే పాత్ర కోసం జుట్టు కనక కట్ చేయాల్సి వస్తే అసలు ఆ సినిమానే వదులుకుంటానని అలాంటి పాత్రలతో ఎవరు నా వద్దకు రావద్దు అంటూ డైరెక్టర్లకు నేరుగా చెప్పకనే చెప్పేశారు.

నేను జుట్టు కత్తిరించడం మా అమ్మకు ఏమాత్రం ఇష్టం ఉండదు. అమ్మ మాటను నేను వేద వాక్కుగా భావిస్తాను. అందుకే అలాంటి పాత్రలలో అస్సలు చేయరని తెలిపారు. తన మొదటి సినిమా ధడక్ కోసం జుట్టు కత్తిరించిన సమయంలో అమ్మ చాలా కోపడిందని, ఇకపై ఎలాంటి పాత్రకైనా జుట్టు మాత్రం కత్తిరించొద్దు అంటూ అమ్మ నాకు చెప్పింది. అయితే ఆ సినిమా విడుదల కాకుండానే అమ్మ మరణించడంతో అమ్మ చెప్పిన ఈ మాటలను శిరసా వహిస్తూ పాటిస్తున్నానని జాన్వీ కపూర్ వెల్లడించారు.

ఇక తెలుగులో దేవర సినిమా ద్వారా మొదటి సక్సెస్ అందుకున్న జాన్వీ కపూర్(Janhvi Kapoor) మరో సినిమా అవకాశాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. దేవర విడుదల కాకుండా ఈమెకు మరో పాన్ ఇండియా స్టార్ హీరో రామ్ చరణ్ తో సినిమా చేసే అవకాశాన్ని కూడా అందుకున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఇక ఈ సినిమాకు బుచ్చిబాబు డైరెక్షన్ చేస్తున్న సంగతి తెలిసిందే.

Share This Article
Exit mobile version