Janhvi Kapoor : బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆమె తరచూ సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ సంచలనం సృష్టిస్తుంది. ఆమె షేర్ చేసిన ఫోటోలు క్షణాల్లో వైరల్ అవుతాయి. అభిమానులు ఆమెను గ్లామర్ క్వీన్‌గా కొలుస్తారు. అయితే ఆ గ్లామరే ఇప్పుడు ఆమె కెరీర్‌ను దెబ్బతీసేలా కనిపిస్తోంది. తాజాగా తొలి సౌత్ మూవీ దేవరకు జాన్వీ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందనే విషయం బయటకు వచ్చింది.
ఓ వైపు అందాల డోస్ పెంచుకుంటూనే మరోవైపు ట్రెడిషనల్ లుక్స్ తో ఆకట్టుకుంటూ ముందుకు సాగుతోంది జాన్వీ. జాన్వీ దివంగత నటి శ్రీదేవి కుమార్తెగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. స్టార్ కిడ్ బ్రాండ్‌తో బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటించి అలరించింది. సినిమాలే కాకుండా వెబ్ సిరీస్‌లు, యాడ్స్‌తో బిజీగా ఉంది. మరోవైపు ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇంత పాపులారిటీ ఉన్నప్పటికీ, నటిగా చిత్ర పరిశ్రమలో తనను తాను నిరూపించుకోవడానికి జాన్వీ కపూర్ చాలా కష్టపడుతోంది. విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని తెగ ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో దేవర సినిమాతో టాలీవుడ్లోకి అడుగు పెట్టబోతోంది. అయితే
ఈ సినిమా కోసం జాన్వీ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దేవర సినిమాలో యంగ్ టైగర్ తో నటించేందుకు జాన్వీ 5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇది ఒక మామూలు హీరోయిన్‌కి ఇచ్చే రెమ్యూనరేషన్. సీనియర్ హీరోయిన్లు సైతం ఇప్పటికీ సినిమాలు చేయడానికి 3 నుంచి 5 కోట్లు తీసుకుంటున్నారు. అయితే జాన్వీ కపూర్ లాంటి హీరోయిన్ కూడా సీనియర్ హీరోయిన్ల రేంజ్ పారితోషికం తీసుకుంటుండడంతో ఆమె పాత్రపై కొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఎన్టీఆర్-కొరటాల కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ దేవరతో జాన్వీ టాలీవుడ్లోకి అడుగు పెడుతోంది. సెప్టెంబర్ 27న విడుదల కానున్న ఈ చిత్రం.. ఇటీవలే దేవర ట్రైలర్‌ను విడుదల చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. పైగా అందులో జాన్వీ కనిపించింది తక్కువే. ఇప్పుడు ఆమె ఎంత రెమ్యునరేషన్ తీసుకుందనే విషయం బయటకు రావడంతో అసలు దేవరలో జాన్వీ పాత్రకు ఇంపార్టెన్స్ ఉందా? అని అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని పెద్ద హీరోల సినిమాల్లో నటీమణులు కేవలం గ్లామర్‌కే పరిమితమవుతున్నారు.
ఇప్పుడు ‘దేవర’ సినిమాలో జాన్వీ కపూర్‌ని కూడా గ్లామర్ డాల్‌గా ఉంచారా అనే ప్రశ్న తలెత్తింది. టాలీవుడ్లో జాన్వీ కపూర్‌కి ఇదే మొదటి సినిమా. ఈ సినిమాలో నటన పరంగా తనను తాను ప్రూవ్ చేసుకుంటే సౌత్ లో నటించేందుకు మరిన్ని ఆఫర్లు వస్తాయి. అయితే ఆమె కేవలం కొన్ని గ్లామర్ సన్నివేశాలకే పరిమితమైందన్న వార్తలపై ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో, దేవరలో జాన్వీ కపూర్ పాత్ర గురించి తెలుసుకోవాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.