YS Sharmila : వైయస్ కుటుంబంలో విభేదాలు రావడంతో సొంత చెల్లెలే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మారి తరచూ తన అన్నయ్య పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇకపోతే తాజాగా షర్మిల (YS Sharmila) తన అన్నయ్య జగన్మోహన్ రెడ్డి పై మరోసారి ఫైర్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లకపోవడం గురించి విమర్శలు చేసిన షర్మిల సోషల్ మీడియాలో వైకాపా కార్యకర్తలకు జగన్ మద్దతు ఇవ్వడానికి కూడా తప్పుపట్టారు.
సోషల్ మీడియా వేదికగా మహిళల గురించి అసభ్యకరమైన అభ్యంతరకరమైన పోస్టులు చేస్తున్న వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని ఈమె కోరారు. తాను కూడా సోషల్ మీడియా బాధితురాలేనని తెలిపారు. నాపట్ల అమ్మ విజయమ్మ పట్ల చెల్లి సునీతపై కూడా ఎంతోమంది ఎంతో నీచాతి నీచమైన పోస్టులు పెట్టారు. మాపై ఇలాంటి పోస్టులు చేయించింది జగనే. ఇలాంటి వారిని ప్రోత్సహించింది కూడా జగనే అంటూ షర్మిల తెలియజేశారు.
Also Read : Sekhar Basha: అరెస్ట్ వార్తలపై స్పందించిన శేఖర్ భాష.. అసలు నిజం ఇదేనంటూ?
YS Sharmila’s Critique: ‘Jagan Dreams of Returning to Power’
గత కొన్ని సంవత్సరాలుగా సైతాన్ సైన్యాన్ని వైసీపీ ఏర్పాటు చేసుకుంది. ఇది సహించరాని విషయం.. నా క్యారెక్టర్‌పై విమర్శలు చేస్తారా. మీకు ధైర్యం ఉంటే నా ముందు వచ్చే విమర్శలు చేయండి. సోషల్ మీడియా వేదికగా కూడా విమర్శలు చేయవచ్చు కానీ పరిధి దాటి విమర్శలు చేయడం సరైనది కాదు. ఈ విషయంలో ఎవరున్న వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి .అది జగన్ అయినా అవినాష్ అయినా సరే శిక్ష పడాల్సిందేనని తెలిపారు.
పోలీసు వ్యవస్థను తన ఇష్టానికి వాడుకున్నది జగనన్నే ఇప్పుడు ఆయనే పోలీసుల తీరుపై మండిపడుతూ వారికి వార్నింగులు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. తాము అధికారంలోకి వస్తే పోలీసులు పట్ల కఠినమైన చర్యలు ఉంటాయని జగనన్న చెబుతున్నారు. మరోసారి అధికారంలోకి వస్తామని జగన్ కలలు కంటున్నారని షర్మిల తెలిపారు. ప్రతిపక్ష హోదా లేకపోయినా జగన్ పోలీసులను బెదిరిస్తున్నారు అంటే వీరికి ఇంకా అహంకారం తగ్గలేదని తెలిపారు. ఇలాంటి విషయాలలో పోలీసులు నిష్పక్షపాతంగా విచారణలు జరిపి అరెస్టులు చేయాలని షర్మిల కోరారు.