J.C Prabhakar Reddy : నా ఇష్టం వచ్చినట్టు తిడతా… పడాల్సిందే

J.C Prabhakar Reddy : సీనియర్ టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తన మాట తీరు కారణంగా ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు. గత ఐదు సంవత్సరాల కాలంలో ఈయన పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం తన కుమారుడు ఎమ్మెల్యేగా గెలవడంతో ఈయన కూడా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్నారు.

ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ పాలన గురించి అలాగే తనని ఇబ్బందులకు గురిచేసిన నాయకులకు గురించి జేసీ ప్రభాకర్ రెడ్డి (J.C Prabhakar Reddy) ఎప్పటికప్పుడు సంచలనమైన వ్యాఖ్యలు చేస్తూ వార్తలో నిలుస్తున్నారు. తాజాగా మరోసారి ఈయన తాడిపత్రి వాసులను ఇష్టమొచ్చినట్లు తిట్టిపడేశారు. నాకు ఇష్టం వచ్చినట్టు తిడతాను పడాల్సిందే మీకు నచ్చకపోతే ఇక్కడ ఉండండి లేదంటే వెళ్లిపోండి అంటూ మాట్లాడారు.

Also Read : Sri Reddy : జగనన్న క్షమించు… లోకేష్ అన్న సారీ శ్రీ రెడ్డి మెడకు బిగుస్తున్న ఉచ్చు?

J.C Prabhakar Reddy

తాడిపత్రి జనాలకు ఏమాత్రం క్రమశిక్షణ లేకుండా పోయింది. జనాలను దారిలో పెట్టాలంటే కచ్చితంగా తిట్టాల్సిందే .. మీరు పడాల్సిందే. క్రమశిక్షణ విషయంలో మీరు మారుతారా లేదంటే నన్నే వెళ్లిపొమ్మంటారా. మీకు నేనే సమస్య అయితే వెళ్లిపొమ్మంటే ఇప్పుడే నేను వెళ్ళిపోతాను. ఉంటే మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ఉంటానని తాడిపత్రి వాసులకు హెచ్చరించారు.

శుభ్రత విషయంలో తాను ఏమాత్రం రాజీ పడే అవకాశమే లేదని తెలిపారు. ఎవరైతే రోడ్లపై చెత్త వేస్తుంటారో అలాంటి వారి ఇంటికి కరెంటు నీటి సరఫరా నిలిపి వేయిస్తాను. ఇక పిల్లలకు పెద్ద పెద్ద చదువులు కాదు ముందు క్రమశిక్షణ నేర్పించండనీ తెలిపారు. క్రమశిక్షణ లేకపోతే పిల్లలందరూ కూడా చెడిపోతారని ఈయన తెలిపారు. అమెజాన్ రెడ్ బస్ ఓనర్లు, ఎలాన్ మస్క్ వీరందరూ కూడా పెద్ద పెద్ద చదువులు చదువుకోలేదు కానీ గొప్ప స్థాయిలో ఉన్నారు. ఇప్పుడంతా కొత్త షావుకారులు వస్తున్నారు చదువు లేనోడు అద్భుతమైన ఇంటిని కడుతున్నారు. వీరంతా బుర్రున్నోళ్లు. ఇంజనీర్లు కంటే మున్సిపాలిటీలో చెత్త ఊడ్చే పర్మినెంట్ ఉద్యోగస్తులకే జీతాలు ఎక్కువగా వస్తున్నాయి. తాడిపత్రి ప్రజలకు ఉన్నది రెండే ఆప్షన్లు ఒకటి మీరైనా మారాలి రెండు నేనైనా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Share This Article
Exit mobile version