Ntr: ఈ తెగువ అప్పుడే ఏమైంది తారక్… సమంత విషయంలో విమర్శల పాలైన ఎన్టీఆర్!

2 Min Read

Ntr : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్లో ఉన్నారు. ఇక ఎన్టీఆర్ అత్యవసరమైతే తప్ప సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు చేయరు. ఇదిలా ఉండదా ఇటీవల తెలంగాణ మంత్రి కొండా సురేఖ సమంత అక్కినేని నాగచైతన్య గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ఇటు చిత్ర పరిశ్రమలోను అటు రాజకీయాల పరంగా కూడా ఈ విషయం చర్చలకు కారణమవుతుంది. ఇలా తన రాజకీయాల కోసం కొండా సురేఖ అక్కినేని కుటుంబం గురించి సమంత గురించి మాట్లాడటంతో సినీ పెద్దలు స్పందించారు.

ఇలా ఇండస్ట్రీలో ఉన్నటువంటి స్టార్ హీరోల నుంచి మొదలుకొని డైరెక్టర్లు టెక్నీషియన్లు హీరోయిన్స్ కూడా ఈ విషయంపై స్పందిస్తూ అక్కినేని కుటుంబానికి సమంతకు చాలా మద్దతుగా నిలబడ్డారు. ఇక ఎన్టీఆర్(Ntr) కూడా సోషల్ మీడియా వేదికగా సురేఖ గారు అంటూ పేరు ప్రస్తావిస్తూ ఎంతో గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న మీరు మహిళల పట్టా ఇలా మాట్లాడటం సరైనది కాదు అంటూ సమంతకు మద్దతుగానే ఈయన మాట్లాడి కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు.

Also Read : Samantha: సమంత పై మంత్రికి సంచలన వ్యాఖ్యలు.. ఏకమైన టాలీవుడ్!

ఇలా సమంతకు ఎన్టీఆర్ మద్దతుగా నిలవడం మంచిదే కానీ కొంతమంది ఎన్టీఆర్ ను ఇదే విషయంపై ట్రోల్ చేస్తున్నారు. మహిళల గురించి వారి రక్షణ గురించి ఇంతగా మాట్లాడే ఎన్టీఆర్ గతంలో తన సొంత మేనత్త గురించి ఆంధ్రప్రదేశ్ వైకాపా నాయకులు అసెంబ్లీలో మాట్లాడినప్పటికీ ఎన్టీఆర్ ఏదో స్పందించాలి కనుక స్పందించాలి అనే విధంగా ఒక వీడియో విడుదల చేశారు. అప్పుడు ఎందుకు ఇలా పేర్లు ప్రస్తావిస్తూ మాట్లాడలేదు ఎన్టీఆర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఓహో అప్పుడు మీ అత్తను మాట్లాడింది స్వయంగా నీ స్నేహితులు కావడంతోనే అలా వ్యవహరించారా అంటూ పలువురు ఎన్టీఆర్ పట్ల ట్రోల్స్ చేస్తున్నారు. ఈ విధంగా ఎన్టీఆర్(Ntr) సమంత విషయంలో ప్రశంసల కంటే విమర్శలే ఎక్కువగా అందుకుంటున్నారని చెప్పాలి.అదేవిధంగా జగన్ హయాంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరుని తొలగించి వైయస్సార్ పేరుని పెట్టినప్పుడు కూడా ఈయన పెద్దగా రియాక్ట్ అవ్వలేదు అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

Share This Article