విడాకుల బాట పట్టిన జబర్దస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పీ… కారణం అదేనా?

2 Min Read

kirak RP : కిరాక్ ఆర్పీ ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వార్తలలో నిలుస్తున్నారు. జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా కొనసాగుతున్న ఈయన తన కామెడీ స్కిట్ల ద్వారా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అయితే మల్లెమాల వారితో తనకొచ్చిన విభేదాల కారణంగా ఈ కార్యక్రమం నుంచి బయటకు వచ్చి అనంతరం మల్లెమాల వారి పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలిచారు.

ఇక జబర్దస్త్ కార్యక్రమం నుంచి బయటకు వచ్చిన తర్వాత కిరాక్ ఆర్పీ(kirak RP) నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అంటూ ఓ రెస్టారెంట్ బిజినెస్ ప్రారంభించారు. ఈ బిజినెస్ చాలా మంచిగా సక్సెస్ అయింది అయితే ఈయన ఇటీవల కాలంలో తన బిజినెస్ పూర్తిగా పక్కన పెట్టేసి కేవలం ఏపీ రాజకీయాలపై ఫోకస్ చేస్తూ కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ వైకాపా పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

Also Read : Pawan Kalyan : కార్తీ తిరుమల లడ్డు వివాదం పై మరోసారి స్పందించిన పవన్.. బ్రదర్స్ అంటూ!

ఈ విధంగా వైసీపీ నాయకుల పట్ల ఇష్టాను సారంగా మాట్లాడటంతో ఈయన వ్యవహారం సంచలనంగా మారింది. ఇక ఈయన కెరియర్ పరంగా రాజకీయాల పరంగా పక్కన పెట్టి వ్యక్తిగత విషయానికి వస్తే గత ఏడాది లక్ష్మీ ప్రసన్న అనే అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్నారు. అయితే వీరి పెళ్లి జరిగి ఏడాది కూడా కాకుండానే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

వీరిద్దరూ విడాకులు తీసుకోవడానికి కారణం ఈయన ఫ్యామిలీ గురించి ఆలోచించకుండా తరచూ రాజకీయాల గురించి మాట్లాడుతూ వివాదాలలో చిక్కుకోవడమేనని తెలుస్తోంది. అంతేకాకుండా తన భార్యను తన మాజీ ప్రియుడుతో కలిసి తిరగడం ఆర్పీ చూశారని అందుకే ఇద్దరి మధ్య గొడవలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోయారు అంటూ ఒక వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరి ఆర్పీ గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో లేదో తెలియదు కానీ ఈ వార్తలు మాత్రం బాగా వైరల్ అవుతున్నాయి. ఇక ఈ వార్తలు నిజం కాకపోతే ఇప్పటికే ఈయన ఈ వార్తలను పూర్తిగా ఖండించేవారు. ఇప్పటి వరకు ఈ విషయం పై ఎక్కడ కూడా స్పందించిన దాఖలాలు లేవు. దీంతో ఈ వార్తలు కాస్త వైరల్ అవుతున్నాయి.

Share This Article
Exit mobile version