Nagachaitanya: పిల్లలు అంటే నాకు చాలా ఇష్టం… నాగ చైతన్య సంచలన వ్యాఖ్యలు!

Nagachaitanya : సినీ నటుడు నాగచైతన్య గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా వార్తలలో నిలుస్తున్నారు. అయితే ఈయన వార్తలలో నిలవడానికి కారణం లేకపోలేదు. నాగచైతన్య సినీనటి సమంతకు విడాకులు ఇచ్చి మరొక పెళ్లికి సిద్ధం కావడంతో ఈయనకు సంబంధించి ఎన్నో రకాల వార్తల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా మరోసారి నాగచైతన్య పిల్లల గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.

నాగచైతన్య సమంతను ప్రేమించి పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఇలా వివాహమైన మూడు సంవత్సరాలకు వీరిద్దరూ బేధాభిప్రాయల కారణంగా విడాకులు తీసుకొని విడిపోయారు అయితే సమంత నాగచైతన్య విడాకులకు సంబంధించి ఎన్నో రకాల వార్తల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కానీ వీరి విడాకులకు కారణం మాత్రం ఇప్పటివరకు తెలియలేదు. ఇలా ఇద్దరు విడిపోయిన తర్వాత నాగచైతన్య తిరిగి శోభిత ప్రేమలో పడటం ఆమెను పెళ్లి చేసుకోవడానికి సిద్ధం కావడంతో శోభిత కారణంగానే నాగచైతన్య సమంత మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి అనే వార్త కూడా వెలుగులోకి వచ్చింది.

Also Read : Samantha : రెండో పెళ్లి పై సమంత సంచలన వ్యాఖ్యలు… చైతూ బాటలోనే నడుస్తుందా?

Nagachaitanya

ఇక తాజాగా నాగ చైతన్య రానా హోస్ట్ గా వ్యవహరిస్తున్న ది రానా దగ్గుబాటి టాక్ షో కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ టాక్ షో ఈ నెల 23వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కాబోతోంది తాజాగా ఇందుకు సంబంధించిన ఒక ప్రోమో వీడియో విడుదల చేశారు. ఇందులో ఎంతోమంది సినీ సెలబ్రిటీలు ఈ కార్యక్రమానికి హాజరై సందడి చేశారని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే నాగచైతన్య కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందులో భాగంగా నాగచైతన్యను రానా ప్రశ్నిస్తూ మీ కుటుంబం అంటే ఎలా ఉండాలని కోరుకుంటున్నానని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు నాగచైతన్య సమాధానం చెబుతూ పెళ్లి చేసుకుని నా భార్య పిల్లలతో నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. దీంతో నాగచైతన్యకు పిల్లలు అంటే చాలా ఇష్టమని పిల్లల విషయంలోనే సమంతతో గొడవ పడి విడాకుల వరకు వెళ్లారని మరోసారి వీరి విడాకుల గురించి చర్చలు జరుగుతున్నాయి. సమంత పెళ్లి చేసుకున్న సమయంలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు అలాంటి సమయంలో పిల్లలను కనుక ప్లాన్ చేస్తే తన కెరీర్ పై ప్రభావం పడుతుందని, పిల్లల విషయంలోనే వీరి మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతోనే విడాకుల వరకు వెళ్లారనీ ఈ వార్తలపై చర్చలు జరుగుతున్నాయి.

Share This Article