Manchu Lakshmi: బన్నీ అంటే చాలా ఇష్టం.. పుష్ప సినిమా అస్సలు నచ్చలేదు

2 Min Read

Manchu Lakshmi : మంచు లక్ష్మి పెద్దగా పరిచయం అవసరం లేని పేరు మోహన్ బాబు వారసురాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈమె ఎప్పుడు ఏం మాట్లాడినా సెన్సేషనల్ అవుతుంది. ఇక సోషల్ మీడియాలో కూడా మంచు లక్ష్మి చేసే పోస్టులు క్షణాలు వైరల్ అవ్వడమే కాకుండా పలు వివాదాలకు కూడా కారణమవుతూ ఉంటాయి. అయితే ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి ఆదరణ సొంతం చేసుకుందో మనకు తెలిసిందే. ఈ సినిమాపై ఎంతోమంది సినీ సెలెబ్రిటీలు కూడా స్పందిస్తూ అల్లు అర్జున్(Manchu Lakshmi) నటనపై ప్రశంశల వర్షం వర్షం కురిపించారు. ఇకపోతే ఇవాళ మంచు లక్ష్మి ఒక ఇంటర్వ్యూ సందర్భంగా నాకు పుష్ప సినిమా ఏ మాత్రం నచ్చలేదంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. అసలు ఈమెకు ఈ సినిమా ఎందుకు నచ్చలేదనే విషయాన్ని కూడా వెల్లడించారు.

Also Read : మూడు రోజుల పాటు పూరీ జగన్నాథ ఆలయం మూసివేత

సాధారణంగా ఒక హీరో అభిమానులు తమ హీరోని అనుసరిస్తూ ఉంటారు ఆయన ఎలా చేస్తే అభిమానులు కూడా అలా చేస్తుంటారు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని హీరోలు సమాజానికి మంచి కలిగే అంశాలను తమ సినిమాలలో చూపిస్తూ ఉంటారు. అయితే అల్లు అర్జున్ పాత్ర కూడా పుష్ప సినిమాలో అలాగే ఉందని తెలిపారు.

పుష్ప సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్‌లో పలు లోపాలు ఉన్నాయి. ఈ సినిమాలో అమ్మాయిలను చాలా చులకనగా చూశారు… హీరోయిన్‌తో కారులో లో వచ్చే సీన్స్ అస్సలు నచ్చలేదు. అల్లు అర్జున్‌ లాంటి ఒక స్టార్ హీరో ఇలాంటి పాత్రలలో నటిస్తే అతని అభిమానులు కూడా మేము చేస్తే తప్పేంటి అనే ఆలోచన చేస్తారని తెలిపారు. ముఖ్యంగా మారుమూల ప్రాంతాలలో ఉన్నటువంటి కుర్రాళ్ళు తమ హీరో ఏం చేస్తే అదే వేదమని భావిస్తారు.

తమ అభిమాన హీరో చేస్తే తప్పు లేనిది మేం చేస్తే తప్పేంటని అనుకుంటారు. ఆ విషయం నన్ను ఎంతగానో బాధ పెట్టిందని లేదంటే పుష్ప సినిమా నాకు నచ్చేదని అన్నారు. ఇక అల్లు అర్జున్ అంటే ఇష్టం ఉన్నంత మాత్రాన ఆయన చేసే ప్రతి ఒక్క పాత్ర ఇష్టపడాలని లేదు కదా అంటూ ఈ సందర్భంగా మంచు లక్ష్మి పుష్ప సినిమా గురించి తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Share This Article