Janhvi Kapoor : అమ్మ తర్వాత నాకు అన్ని ఆమెనే…జాన్వీ కపూర్ కామెంట్స్ వైరల్!

2 Min Read

Janhvi Kapoor : ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా సక్సెస్ అందుకున్న వారిలో దివంగత నటి శ్రీదేవి ఒకరు. ఈమె భాషతో సంబంధం లేకుండా అన్ని భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు పొందారు. ఇలా నటిగా ఇండస్ట్రీని ఓ ఊపు ఊపిన శ్రీదేవి అకాల మరణం ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి. 54 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి శ్రీదేవి మరణించడంతో ఎంతోమంది అభిమానులు ఇప్పటికీ ఆ మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు.

ఇక శ్రీదేవి బ్రతుకున్న సమయంలోనే తన పెద్ద కుమార్తె జాన్వీ కపూర్(Janhvi Kapoor) ధడక్ సినిమాకు కమిట్ అయ్యారు. ఇక శ్రీదేవి ఉన్న సమయంలో ఆమె సినిమాల ఎంపిక గురించి సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం గురించి ఇలా తన వ్యవహారాలన్నింటినీ చూసుకునేది. ఇలా తన తల్లి మరణించడంతో సినిమాల విషయంలో జాన్వీ మరొక స్టార్ హీరోయిన్ సలహాలు తీసుకుంటున్నారని ఇటీవల ఒక సందర్భంలో వెల్లడించారు.

Also Read : Janhvi Kapoor : చచ్చినా అలాంటి పాత్రలు చేయను… అమ్మ మాటే వేదవాక్కు

అమ్మ తర్వాత నేను ఎలాంటి సినిమాలు చేయాలన్న నా ప్రయాణం ఎటువైపు సాగాలన్న నేను నా పెద్దమ్మ రేఖ సలహా తీసుకుంటానని తెలిపారు. నిజానికి హీరోయిన్ రేఖ శ్రీదేవి ఇద్దరు సొంత అక్క చెల్లెలు కాకపోయినా వీరిద్దరూ అంతకంటే ఎక్కువగా కలిసిమెలిసి ఉండే వారిని జాన్వీ తెలిపారు. బాలీవుడ్‌లో క్రేజీ అండ్ పాపులర్ హీరోయిన్‌గా ఒక తరాన్ని ఊపు ఊపేసింది రేఖ. అలాంటి రేఖ అంగీకరిస్తేనే ఏమైనా చేస్తానని జాన్వీ చెప్పింది. తన తల్లి తర్వాత అంత ఇంపార్టెన్స్ పెద్దమ్మ రేఖకు ఇచ్చినట్లు తెలిపారు.

ధడక్ సినిమా షూటింగ్ సమయంలో అమ్మ చనిపోయారు. అమ్మ చనిపోయిన తర్వాత ఆ బాధ్యతలను రేఖ పెద్దమ్మ తీసుకున్నారని ఈ సినిమా ట్రైలర్ లాంచ్ సమయం నుంచి సినిమా విడుదల అయ్యే వరకు ఆమె నన్ను దిశా నిర్దేశం చేశారని తెలిపారు.అమ్మ ఇప్పుడు నా దగ్గర లేదు కాబట్టి.. పెద్దమ్మ అంగీకారమే నాకు ముఖ్యమని నేను భావిస్తాను. ఎందుకంటే అమ్మ, ఆమె ఇద్దరూ కళాత్మకంగా, నిర్ణయాత్మకంగా ఒకేలా ఆలోచిస్తారు.

ఒక విషయం చెప్పాలంటే అమ్మ తర్వాత నేను పెద్దమ్మ సలహాలు ఆమె నిర్ణయం కోసమే ఎదురు చూస్తాను అంటూ ఈ సందర్భంగా రేఖ గురించి జాన్వీ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక జాన్వీ ఇటీవల దేవర సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు.

Share This Article
Exit mobile version