Cyber Criminals : దేశ వ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు విచ్చలవిడిగా నేరాలకు పాల్పడుతున్నారు. అమాయక ప్రజలను ఆసరాగా చేసుకుని కొందరు అక్రమార్కులు సులువుగా డబ్బు సంపాదించేందుకు మోసాలకు తెగబడుతున్నారు. వాట్సాప్ , ఫేస్‌బుక్ , స్టాగ్రామ్ అనే తేడా లేకుండా అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి నిలువునా దోచేస్తున్నారు. క్యూఆర్ కోడ్స్ , వెబ్ లింక్ లతో అమాయకుల నుంచి అందిన కాడికి దోచుకుంటున్నారు. కొరియర్ల పేరుతో డిజిటల్ అరెస్టులు అంటూ బ్యాంకు ఖాతాల్లో డబ్బునంతా ఖాళీ చేస్తున్నారు. స్టాక్ మార్కెట్లు , ట్రేడింగ్‌లో పెట్టుబడి పెడితే రెండింతలు లాభం వస్తుందని నమ్మించి ముంచేస్తున్నారు.
తాజాగా, విజయవాడకు చెందిన ఓ యువతి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తుంది. ఇటీవలే ఆమె తన తల్లిదండ్రులకు చూసేందుకు గురువారం విజయవాడ వెళ్లింది. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి యువతికి ఫోన్ చేశాడు. మీకు కొరియర్ వచ్చిందని తెలిపాడు. తాను ఎవరు కొరియర్ పంపరని తెలిపింది. అయితే ఆ వ్యక్తి మీ పేరుతోనే, మీ నెంబర్ వుందని తెలిపాడు. లేదంటే మీకెందుకు కాల్ చేస్తామని సున్నితంగా తెలిపాడు. అయితే ఆ యువతి సరే కొరియర్ పంపాలని చెప్పింది. అయితే ఇదే అలుసుకుగా భావించిన అవతల వ్యక్తి నీకు కొరియర్ వచ్చింది డ్రగ్స్ అన్నాడు. అంతే ఆ యువతి షాక్ కు గురైంది. నాకు కొరియర్ డ్రగ్స్ రావడం ఏంటి అయితే అది నాది కాదని తెలిపింది.
Also Read : Paytm Q2 Results : ఫస్ట్ టైం లాభాల్లోకి వచ్చిన పేటీఎం.. ఎన్ని వేల కోట్లు సంపాదించిందంటే ?
QR Codes and Web Links: How Cyber Criminals Are Targeting Innocent Victims
అయితే ఆ వ్యక్తి ఆ యువతిని బెదిరించడం మొదలుపెట్టాడు. మీకు కొరియర్ లో డ్రగ్స్ తో పాటు , ఇతర నిషేధిత మత్తు పదార్థాలు ఉన్నాయని ఈ విషయం పోలీసులకు తెలిపకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. డబ్బులు లేవని ఆ యువతి మొర పెట్టుకున్నా చివరకు ఆ వ్యక్తికి మాటలకు భయపడి డబ్బులు ఇచ్చేందుకు ఒప్పుకుంది. పలు దఫాలుగా రూ.1.25 కోట్లు అతను చెప్పిన విధంగానే పంపింది. తనకు వచ్చిన కొరియర్ లో నిజంగానే డ్రగ్స్ వచ్చాయా అని ఒకటి రెండు సార్లు ఆలోచించిన యువతి చివరకు మోసపోయానని గుర్తించి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన డబ్బులు తమకు చేరేలా చూడాలని వేడుకుంది.