Anitha: సింహం సింగిల్ గా రావడం అంటే ఇదే… హోమ్ మినిస్టర్ అనిత కామెంట్స్ వైరల్!

Anitha : ఏపీ హోమ్ శాఖ మంత్రి అనిత ఎప్పటికప్పుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పై తనదైన శైలిలో సెటైర్లు వేస్తూ ఉన్నారు. గతంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను, నేతలను ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు. ఇక ప్రస్తుత జరిగిన ఎన్నికలలో వైకాపా ఘోరంగా ఓటమిని ఎదుర్కొంది. కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం కావడంతో అసెంబ్లీలో కనీసం ప్రతిపక్ష నేత హోదా కూడా అందుకోలేకపోయింది.

ఇలా జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేతగా హోదా లేకపోవడంతో ఈయన ఇదే సాకుగా భావించి అసెంబ్లీకి దూరంగా ఉంటున్నారు. ఇలా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లకపోవడం పట్ల పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే హోం మంత్రి అనిత (Anitha) కూడా ఈ విషయంపై స్పందిస్తూ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.

Also Read : Anchor shyamala: హోం మంత్రిగా పాలన చేతకాకపోతే వెంటనే దిగిపో.. అనిత పై శ్యామల ఫైర్?

Anitha

ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన చంద్రబాబు నాయుడు గారిని చాలా ఇబ్బందులకు గురి చేశారు. అసెంబ్లీలో ఎంతో అవమానకరంగా మాట్లాడారు హేళన చేశారు. కొన్ని సందర్భాలలో మైక్ కూడా ఇవ్వలేదు. గతంలో తమ పార్టీకి 23 స్థానాలు వచ్చి ప్రతిపక్ష నేత హోదా ఉన్నప్పటికీ కూడా మైక్ ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారని అయినప్పటికీ చంద్రబాబు నాయుడు వెనుకడుగు వేయకుండా తరచూ అసెంబ్లీకి వస్తూ అధికార ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారని అనిత తెలిపారు.

ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలకు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు దూరంగా ఉన్నారని ఈమె ప్రశ్నించారు. సింహం సింగిల్ గా రావడం అంటే ఇదేనంటూ ఈమె చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడారు.. ఎమ్మెల్యేలను లాక్కున్నావు.. బూతే సిగ్గుపడేలా బూతులు తిట్టించావు. ప్రతిపక్ష నేతలను సస్పెండ్ చేయించిన బాబు గారు మాత్రం ఎలాంటి సాకులు చెప్పకుండా ఒక్కరే అసెంబ్లీకి వచ్చారు. ఇప్పుడు ఎవరు సింహం ఎవరు మేకవన్నే పులులో వేరే చెప్పాలా ?ఎనీ డౌట్స్ ?అంటూ ఈమె చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి.

Share This Article
Exit mobile version