Pawan Kalyan : సినీ నటుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల పిఠాపురంలో పర్యటన చేసిన సంగతి తెలిసిందే .అయితే పిఠాపురం పర్యటనలో భాగంగా ఈయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయని రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు, నేరాల విషయంలో అధికారుల తీరుపై ముఖ్యంగా పోలీస్ శాఖపై ఈయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహిళల గురించి అసభ్యకరంగా వ్యవహరించిన తప్పు చేసిన వారిని ఏమాత్రం ఉపేక్షించకుండా శిక్షించాలని ఈ విషయంపై హోం శాఖ తగిన చర్యలు తీసుకోకపోతే తానే హోం మినిస్టర్ గా బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుంది అంటూ ఈయన హోం శాఖ మంత్రికి ఆదేశాలు జారీ చేశారు అయితే ఈ వ్యాఖ్యలపై హోం మంత్రి అనిత స్పందించారు.
Also Read : Pawan Kalyan: తిరుపతి లడ్డు అపవిత్రం చేశారని మేము ఎక్కడ చెప్పలేదు
No Fault in Pawan Kalyan’s Remarks – Responds Home Minister Anitha!
ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)గారు చేసిన వ్యాఖ్యలలో ఏమాత్రం తప్పులేదని ఆయన మాటలను మేము చాలా పాజిటివ్ గా, బాధ్యతగా తీసుకుంటున్నామని తెలిపారు.. పవన్ కళ్యాణ్ ఆర్డర్ వేయడంతో ఇప్పటికే ఈమె జిల్లాల వారీగా పర్యటిస్తూ ఆయా పోలీస్ శాఖ ఉన్నత అధికారులతో చర్చలు సమావేశాలను నిర్వహిస్తూ అక్కడి పరిస్థితులను అడిగి మరీ తెలుసుకుంటున్నారు.
ఇప్పటికే చిత్తూరు ఉమ్మడి అనంతపురం జిల్లాలలో హోమ్ మినిస్టర్ అనిత స్పందించారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను, గంజాయి వంటి అంశాలను ఏమాత్రం ఉపేక్షించేది లేదని తెలిపారు. అత్యాచారానికి పాల్పడిన వారిపట్ల గత ప్రభుత్వం చర్యలు తీసుకుని ఉంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని ఈమె తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అత్యాచారాల విషయంలో అందరిలోనూ ఎంతో ఆందోళన వ్యక్తం అవుతుంది. డిప్యూటీ సీఎం గారు బయటపెట్టారు మేము పెట్టలేదు. ఇలాంటి విషయాల్లో లా అండ్ ఆర్డర్ పకడ్బందీగా అమలు చేయటం కోసం ఎంతగానో కృషి చేస్తున్నాము అంటూ ఈ సందర్భంగా హోమ్ మినిస్టర్ అనిత డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యలపై స్పందించడమే కాకుండా రాష్ట్ర పరిస్థితుల గురించి కూడా ఈమె చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.