Harsha Sai: పరారీలో యూట్యూబర్ హర్ష సాయి… గాలిస్తున్న పోలీసులు.. తప్పును ఒప్పుకున్నట్టేనా?

2 Min Read

Harsha Sai : యూట్యూబ్ ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకొని ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న వారిలో హర్ష సాయి ఒకరు. ఈయనకు యూట్యూబ్లో ఉన్న క్రేజ్ దృష్టిలో పెట్టుకొని ఏకంగా హీరోగా అవకాశాలు కూడా వచ్చాయి. ఇలా కెరియర్ పరంగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న హర్ష సాయి ఇటీవల ఓ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. సినీ నటి నిర్మాత అయినటువంటి ఓ మహిళను లైంగికంగా వేధింపులకు గురి చేయడమే కాకుండా తనపై అత్యాచారం కూడా చేశారని ఆరోపణలు చేశారు.

హర్ష సాయి హీరోగా నటిస్తున్న మెగా సినిమా కాపీరైట్స్ విషయంలో ఈమెతో విభేదాలు వచ్చాయి. తద్వారా ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని అలాగే తనకు మత్తు ఇచ్చి తన పట్ల అత్యాచారానికి పాల్పడటమే కాకుండా తన వీడియోలను తీసుకొని బ్లాక్మెయిల్ చేస్తున్నారని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఇలా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు పలు సెక్షన్లు కింద కేసు నమోదు చేసి హర్ష సాయి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Also Read : Monkeypox: దేశాన్ని వణికిస్తోన్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు

harsha sai in escape

ఇక ఈ ఘటనపై హర్ష సాయి(Harsha Sai) స్పందిస్తూ సదరు మహిళ తనపై చేస్తున్న ఆరోపణలలో ఏమాత్రం నిజం లేదని తెలిపారు. కేవలం డబ్బు కోసం మాత్రమే ఆమె ఇలా చేస్తుందని వెల్లడించారు. అంతేకాకుండా తానేంటో నా సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసని ఈయన తెలిపారు. ఇక ఈ విషయం గురించి హర్ష సాయి అడ్వకేట్స్ కూడా మాట్లాడుతూ మహిళ ఆరోపణలలో నిజం లేదని డబ్బు కోసమే ఆమె ఇలా చేస్తుందని తెలిపారు.

ఇదిలా ఉండగా సదురు యువతీ పోలీస్ కేసు నమోదు చేయడంతో పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి హర్ష సాయి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈయన పట్ల యువతి లైంగిక ఆరోపణల కేసు నమోదు చేయడంతో హర్ష సాయి పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇలా పరారీలో ఉన్నారు అంటే ఈయన తప్పు చేశారనీ పరోక్షంగా ఒప్పుకున్నట్టే కదా అంటూ పలువురు ఈయన వ్యవహారంపై కామెంట్లు చేస్తున్నారు.

పోలీసులకు అందిన సమాచారం ప్రకారం ప్రస్తుతం హర్ష సాయి ముంబైలో నివసిస్తున్నారని తెలుస్తోంది. ఈయనని పోలీసులు అదుపులోకి తీసుకుంటే అసలు నిజానిజాలు ఏంటి అనేది తెలియాల్సి ఉంది. ఇకపోతే యూట్యూబర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని కెరియర్ పరంగా సక్సెస్ అయినటువంటి హర్ష సాయి ఇలాంటి ఆరోపణల ద్వారా తన కెరియర్ మొత్తం నాశనం చేసుకున్నారని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Share This Article
Exit mobile version