Hariteja : బిగ్ బాస్ షో ప్రారంభమై రెండు నెలలు దాటింది. వారాలు గడుస్తున్న కొద్దీ బిగ్ బాస్ ఇంట్లో కంటెస్టెంట్లు తగ్గుతూ వస్తున్నారు. రాబోయే వారాలు హౌసులో ఉన్న కంటెస్టెంట్లకు మరింత కఠినంగా ఉండబోతుంది. ఈ వారం నామినేషన్స్‌లో నిఖిల్, యష్మీ, ప్రేరణ, విష్ణుప్రియ, గౌతమ్ కృష్ణ, పృథ్వీ, హరితేజ ఉన్నారు. వీరిలో నిఖిల్, విష్ణు, గౌతమ్ గురించి ఆలోచించాల్సిన పనిలేదు. వారికి ఓట్లు భారీగా పడి సేఫ్ జోన్ వున్నారు. ప్రేరణ ఓటు బ్యాంకు కూడా ఈ వారం బాగా పెరిగింది.
ఇక మిగిలింది పృథ్వీ, యష్మీ, హరితేజ మాత్రమే. ఈ ముగ్గురిలో ఎవరు సేఫ్ గా ఉంటారు? ఎవరు ఎలిమినేట్ అవుతారు? అనే దానిపై బిగ్ బాస్ ప్రొమో హీట్ పెంచింది. అయితే హరితేజ ఎలిమినేషన్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. ఒక వేళ హరితేజ లేదని అనుకుంటే పృథ్వీ, యష్మీలు హౌసు నుంచి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆడియన్స్ అనుకున్నది ఒకటైతే చూస్తున్న ప్రేక్షకులకు బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. ప్రేక్షకులు ఊహించనది కాకుండా గంగవ్వను హౌసు నుంచి బయటకు పంపాడు. ఆమె ఆరోగ్యం బాగాలేదని అందుకే బయటకు పంపించక తప్పడం లేదంటూ రీజన్ చెప్పాడు బిగ్ బాస్. గంగవ్వ బయటకు వెళ్లాక ఎనిమినేషన్ రౌండ్ అయిపోయిందని అంతా ఊపిరి పీల్చుకున్న కంటెస్టెంట్ లకు మరో ట్విస్ట్ ఇచ్చారు.
Also Read : Nagamanikanta : గంగవ్వకు నాగమణికంఠ సర్ప్రైజ్ గిఫ్ట్ .. ఏంటో తెలుసా?
Hariteja Exits Bigg Boss House: How Much Did She Earn in Six Weeks?
ఎలిమినేషన్ ఇంకా పూర్తి కాలేదని మధ్యలో బ్రేక్ ఇచ్చి అందరిని గందరగోళ పరిస్థితిలో పడేశారు. ఇంతలో ఎవరు బయటకు వెళతారనే చర్చించుకోవడం మొదలు పెట్టారు. అందరూ టాప్ కంటెస్టెంట్లు ఉండడంతో ఎవరు వెళ్లిపోతారనే ఉత్కంఠ అభిమానుల్లో పెరిగింది. అయితే 10వ వారంలో వైల్డ్ కార్డుతో ఇంటిలోకి వచ్చిన హరితేజను బిగ్ బాస్ ఇంటి నుంచి పంపించేసినట్లు తెలుస్తుంది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కారణంగా గంగవ్వ, హరితేజ (Hariteja) ఎలిమినేట్ అయ్యారు. అయితే యష్మికి తక్కువ ఓటింగ్ వచ్చినప్పటికీ ఓటింగ్ ద్వారా ఎలిమినేషన్ నుంచి బయటపడింది. దీంతో హరితేజ మాత్రం ఓటర్ల మనసు గెలుచుకోలేక పోయింది. దీంతో బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది.
ఇక పోతే హరితేజ (Hariteja) బిగ్ బాస్ హౌసులో ఆరు వారాల పాటు ఉంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈమెకు వారానికి రూ.4లక్షలు ఇచ్చారట. అంటే ఆమె ఆరు వారాలు హౌస్ లో కొనసాగింది కాబట్టి, ఆరు వారాలకు గాను రూ.24 లక్షలు రెమ్యూనరేషన్ ఇచ్చారట. ఈ సీజన్ లో ప్రస్తుతం టాప్ ఓటింగ్ తో కొనసాగుతున్న నిఖిల్ కి 12 వారాలతో సమానమైన రెమ్యూనరేషన్ అందుకుంది. అంటే ఆయనకీ వారానికి కేవలం రూ.2 లక్షలు మాత్రమే. హరి తేజ కి మాత్రం నిఖిల్ కి డబుల్ రెమ్యూనరేషన్. ఇప్పుడు ఇదే సోషల్ మీడియా లో చర్చనీయాంశంగా మారింది.