Pawan Kalyan: ప్రస్తుతం సినీ నటుడు రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ దీక్షలో ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈయన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. అయితే ఇటీవల తిరుపతి లడ్డు తయారీ విషయంలో కల్తీ జరిగిందనే విషయాన్ని ప్రస్తుత ప్రభుత్వం బయట పెట్టడంతో ఈ విషయం కాస్త దేశవ్యాప్తంగా శ్రీవారి భక్తులను ఆందోళనకు గురి చేయడమే కాకుండా పెద్ద ఎత్తున చర్చలకు కారణమైంది.
ఇక ఈ విషయం తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ తప్పుకు ప్రాయశ్చిత్తం చేయాలనే ఉద్దేశంతో ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. 11 రోజులపాటు ఈ ప్రాయశ్చిత్త దీక్ష ఉంటుందని వెల్లడించారు. అయితే తిరుపతి లడ్డు వ్యవహారం పై పవన్ కళ్యాణ్ ప్రెస్మీట్లో పెడుతూ సనాతన ధర్మాన్ని కాపాడాలంటూ హితబోధ చేస్తున్నారు. అదే విధంగా ఇలాంటి సమయంలోనే హిందువులంతా కూడా రోడ్లపైకి రావాలని ఈయన చేసే వ్యాఖ్యల పట్ల పలువురు విమర్శలు కురిపిస్తున్నారు.
Also Read : Mokshagna Teja ఇండస్ట్రీకి లాంచ్ చేయాల్సింది ప్రశాంత్ వర్మ కాదా.. బాలయ్య ప్లాన్ వేరే ఉందా?
New Demand Emerges Calls to Immediately Dismiss Pawan Kalyan
ఈ క్రమంలోనే మాజీ ఎంపీ జీవి హర్ష కుమార్ ఈ విషయంపై స్పందించారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. బహుశా ఆయన తన హోదా మరిచిపోయినట్టు ఉన్నారు అందుకే ఇలా ప్రెస్ మీట్ లు పెట్టి అందరిని రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని విమర్శలు కురిపించారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ ఇలా హిందువులని రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం ఏమాత్రం కరెక్ట్ కాదని తెలిపారు. ఇలాంటి వారిని వెంటనే డిస్మిస్ చేయాలని ఈయన డిమాండ్ చేశారు.
మీరు అధికారంలో ఉన్నారు.. తప్పు జరిగిందా లేదా అనే విషయంపై విచారణ జరిపించి తప్పు చేసి ఉంటే కచ్చితంగా శిక్ష విధించండి అంటూ ఈయన తెలిపారు. ఈ విషయంపై విచారణ పక్కన పెట్టేసి సనాతన ధర్మం హిందూమతం అంటూ రెచ్చగొట్టడం భావ్యం కాదని తెలిపారు. అంతేకాకుండా ఇటీవల వరదలు వచ్చి ప్రజలు ఇబ్బంది పడుతుంటే చివర్లో బోట్లపై వచ్చి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఇప్పటివరకు ఒక్కటి కూడా నెరవేర్చలేకపోయారు. ఇలా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పక్కనపెట్టి ఈ లడ్డు వ్యవహారాన్ని తెరపైకి తీసుకు వచ్చారని ఇదంతా కూడా రాజకీయ కుట్రలో భాగమని ఈయన మండిపడ్డారు.