Genelia: అంతా అయిపోయింది.. విడాకులపై జెనీలియా రితేష్ కామెంట్స్!

2 Min Read

Genelia: సినిమా ఇండస్ట్రీలో కొనసాగే నటీనటులు ఎంతో తొందరగా ప్రేమలో పడతారు. అయితే వారు ఎంత తొందరగా ప్రేమలో పడతారో అంతే తొందరగా విడాకులు తీసుకుని విడిపోతున్నారు. ఇటీవల కాలంలో ఎంతోమంది ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న సెలెబ్రిటీల పిల్లాపాపలతో సంతోషంగా గడపగా చాలామంది విడాకులు తీసుకొని విడిపోయిన వారు ఉన్నారు. ఈ క్రమంలోనే సినీనటి జెనీలియా దంపతులు కూడా విడిపోతున్నారు అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

జెనీలియా(Genelia) సౌత్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా నటిగా మంచి గుర్తింపు పొందిన ఈమె నటుడు రితేష్ దేష్ ముఖ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని పిల్లాపాపలతో సంతోషంగా ఉన్నారు. వీరిద్దరిది ప్రేమ వివాహం అనే సంగతి మనకు తెలిసిందే పెళ్లి తర్వాత జెనీలియా(Genelia) పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంటూ తన వ్యక్తిగత జీవితాన్ని గడిపారు. ఇద్దరి మగ పిల్లలకు జన్మనిచ్చిన ఈమె పిల్లల కాస్త పెద్ద అవ్వడంతో తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నారు.

Also Read :Siddharth : సిద్దార్థ్ తన పెళ్లిలో పెట్టుకున్న ఈ వాచ్ ఖరీదు ఎంతో తెలుసా?

ఇదిలా ఉండగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జెనీలియా రితేష్ తనకు బ్రేకప్ చెప్పారంటూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక రితేష్ తనకు బ్రేకప్ చెప్పాడు అంటే అది పెళ్లి అయిన తర్వాత అనుకుంటే మనం పొరపాటు పడినట్టే అని చెప్పాలి. ఈమెకు రితేష్ బ్రేకప్ చెప్పింది పెళ్లికి ముందు అంటూ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.. రితేష్ చాలా ఆలస్యంగా పడుకొనే అలవాటు ఉన్న వ్యక్తి నాకైతే తొందరగా నిద్ర వచ్చేస్తుంది అలా నేను నిద్రపోయిన తర్వాత ఒకరోజు అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో అంతా అయిపోయింది ఇక బ్రేకప్ అంటూ ఒక మెసేజ్ చేశారు.

మరుసటి రోజు ఉదయం ఆ మెసేజ్ చూడగానే నాకు చాలా బాగా ఏడుపొచ్చి ఏడుస్తూ కూర్చున్నాను. ఆ సమయంలోనే రితేష్ ఫోన్ చేసి చాలా కూల్ గా మామూలుగానే మాట్లాడారు. అదేంటి రాత్రి బ్రేకప్ అని చెప్పి మెసేజ్ పెట్టి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు అని అడగడంతో సరదాగా అలా పెట్టాను అంటూ నన్ను ఏడిపించారని ఈ సందర్భంగా రితేష్ జెనీలియా బ్రేకప్ స్టోరీ గురించి ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Share This Article