డబ్బులు రెడీ చేస్కోండి.. మార్కెట్లోని కొత్తగా నాలుగు కార్లు రాబోతున్నాయ్

2 Min Read

upcoming cars : డబ్బులు రెడీ చేస్కోండి.. మార్కెట్లోని కొత్తగా నాలుగు కార్లు రాబోతున్నాయ్హ్యుందాయ్ కార్లకు భారత్ దేశంలో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. మారుతి సుజుకి తర్వాత భారతదేశంలో రెండవ అతిపెద్ద కార్లను విక్రయించే కంపెనీ హ్యుందాయ్ ఇండియా . ఇప్పుడు కంపెనీ తన పలు మోడళ్లను త్వరలోనే భారత మార్కెట్లోకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. హ్యుందాయ్ రాబోయే మోడల్‌లో ఒక ఎలక్ట్రిక్ కారు కూడా ఉంది. మీరు కూడా సమీప భవిష్యత్తులో కొత్త హ్యుందాయ్ కారును కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే త్వరగా డబ్బులు రెడీ చేస్కోండి. రాబోయే రోజుల్లో హ్యుందాయ్ రాబోయే 5 కార్ల ఫీచర్లు, పవర్‌ట్రెయిన్, ధర గురించి వివరంగా తెలుసుకుందాం.

హ్యుందాయ్ టక్సన్ ఫేస్‌లిఫ్ట్
హ్యుందాయ్ గత సంవత్సరం తన పాపులర్ ఎస్ యూవీ టక్సన్ అప్ డేటెడ్ వెర్షన్‌ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. ఇప్పుడు కంపెనీ హ్యుందాయ్ టక్సన్ ఫేస్‌లిఫ్ట్‌ను భారత మార్కెట్లో కూడా విడుదల(upcoming cars) చేయడానికి సన్నాహాలు చేస్తోంది. వార్తా వెబ్‌సైట్ gaadiwaadiలో ప్రచురించబడిన ఒక వార్త ప్రకారం.. హ్యుందాయ్ టక్సన్ ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయబోయే ఎక్స్ టర్నల్, ఇంటీరియర్‌లో పెద్ద మార్పు ఉంటుంది.

Also Read : మైక్రో ఎస్ యూవీకి పెరుగుతున్న ఆదరణ.. 10లక్షల్లో అద్భుతమైన కార్లు

Upcoming cars in the market

హ్యుందాయ్ క్రెటా ఈవీ
మరోవైపు, కంపెనీ తన బెస్ట్ సెల్లింగ్ ఎస్ యూవీ హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ వేరియంట్‌ను కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. టెస్టింగ్ సమయంలో హ్యుందాయ్ క్రెటా ఈవీ చాలాసార్లు రోడ్లపై కనిపించింది. హ్యుందాయ్ క్రెటా ఈవీ తన వినియోగదారులకు ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 400 కిలోమీటర్ల పరిధిని అందజేస్తుందని చాలా మీడియా నివేదికలు పేర్కొంటున్నాయి. మార్కెట్లో, హ్యుందాయ్ క్రెటా ఈవీ ఇటీవల లాంచ్ అయిన టాటా కర్వ్ ఈవీ, రాబోయే మారుతి సుజుకి eVXతో పోటీపడుతుంది.

హ్యుందాయ్ వెన్యూ ఫేస్‌లిఫ్ట్
భారతీయ కస్టమర్లలో ప్రసిద్ధి చెందిన హ్యుందాయ్ వెన్యూ కూడా అప్‌డేటెడ్ వెర్షన్‌లోకి ఎంటర్ అవడానికి రెడీ అవుతోంది. హ్యుందాయ్ వెన్యూ ఫేస్‌లిఫ్ట్ ఎక్ట్సీరియర్, ఇంటీరియర్‌లో కంపెనీ పెద్ద మార్పులు చేయబోతోంది. అయితే, కారు పవర్‌ట్రెయిన్‌లో ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం లేదు.

హ్యుందాయ్ ఇన్‌స్టర్ ఈవీ
మరోవైపు, హ్యుందాయ్ ఇండియా మరొక ఎలక్ట్రిక్ కారును తయారు చేస్తోంది, ఇది ఇన్‌స్టర్ ఈవీనే కావచ్చు. 2025 చివరిలో లేదా 2026 ప్రారంభంలో కంపెనీ హ్యుందాయ్ ఇన్‌స్టర్ ఈవీని ప్రారంభించవచ్చని చాలా మీడియా నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే, కారు పవర్‌ట్రెయిన్, డ్రైవింగ్ రేంజ్ గురించి వివరాలు వెల్లడించలేదు.

Share This Article
Exit mobile version