Pallavi Prashanth: రైతు బిడ్డ అంటూ అందరినీ మోసం చేసిన పల్లవి ప్రశాంత్.. !

2 Min Read

Pallavi Prashanth : పల్లవి ప్రశాంత్ ఒక కామన్ మాన్ గా పొలంలో వ్యవసాయం చేసుకుంటూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎంతో ఫేమస్ అయ్యారు. ఇలా ఈ వీడియోల ద్వారా ఫేమస్ అయిన ఈయనకు బిగ్ బాస్ అవకాశం వచ్చింది. ఇక బిగ్ బాస్ కార్యక్రమంలో తనదైన శైలిలో టాస్కులు ఆడటమే కాకుండా పలు సందర్భాలలో రైతుబిడ్డ అంటూ సింపతి డ్రామాలు కూడా ప్లే చేశారు.

ఇక ఈయన బిగ్ బాస్ విన్నర్ అయితే వచ్చిన డబ్బు అంతా రైతులకే పంచుతానని కామెంట్లు చేసి ఎంతోమందిని ఆకట్టుకొని చివరికి బిగ్ బాస్ విజేతగా బయటకు వచ్చారు.. బయటకు వచ్చిన తర్వాత పల్లవి ప్రశాంత్ తన అసలు స్వరూపం బయటపెట్టారు. ఈయన బిగ్ బాస్ విన్నర్ గా గెల్చుకున్న డబ్బులు ఇప్పటివరకు కేవలం 1,20,000 మాత్రమే పేద రైతులకు పంపిణీ చేశారు.

Also Read :Mokshagna Teja ఇండస్ట్రీకి లాంచ్ చేయాల్సింది ప్రశాంత్ వర్మ కాదా.. బాలయ్య ప్లాన్ వేరే ఉందా?

Pallavi Prashanth

ఇక బిగ్ బాస్ తర్వాత ఈయన మాత్రం రైతుబిడ్డ అనే విషయాన్ని కూడా మర్చిపోయి ఫుల్లుగా సెలబ్రిటీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. తరచూ పలు బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తూ సెలబ్రిటీ లైఫ్ గడుపుతున్నారు. దీంతో ఈయన పట్ల భారీ స్థాయిలో విమర్శలు వచ్చాయి హౌస్ లో సింపతి డ్రామాలు ప్లే చేసి బయటకు వచ్చిన తర్వాత ఇలా ఇచ్చిన మాట తప్పడం సరైనది కాదు అంటూ ఈయన పై విమర్శలు వచ్చాయి.

ఇలా తన గురించి ఎన్ని విమర్శలు వచ్చినా తనకేం సంబంధం లేదన్నట్టు పల్లవి ప్రశాంత్(Pallavi Prashanth) వ్యవహరిస్తున్నారు. తాజాగా కోట్‌ వేసుకుని, మీసాలు మెలేసి టిక్‌ టాప్ లో రెడీ అయ్యి కెమెరా ముందు ఫోజులు కొడుతూ వీడియో దిగాడు. సెలూన్‌లో ఇలా సరికొత్తగా, స్టయిలీష్‌గా తయారై పోజులు కొడుతున్నాడు పల్లవి ప్రశాంత్. ఈ వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈయన వేషధారణ చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఒకప్పుడు రైతుబిడ్డ అంటూ సింపతీ ప్లే చేసిన పల్లవి ప్రశాంత్ ఇప్పుడు మాత్రం ఈ రేంజ్ లో తన లైఫ్ లీడ్ చేయడం అందరికీ షాకింగ్ గానే ఉందని చెప్పాలి. దీంతో మరోసారి ఈ వీడియో పై భారీ స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా పల్లవి ప్రశాంత్ తన తీరు మార్చుకొని ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా లేకపోతే ఇలా తన జల్సాల కోసం ఆ డబ్బును ఖర్చు చేస్తారా అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

Share This Article
Exit mobile version