Devara : దేవర సినిమాని చుట్టుముడుతున్న బ్యాడ్ సెంటిమెంట్స్… సెంటిమెంట్లను బ్రేక్ చేసేనా?

2 Min Read

Devara : యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR)త్వరలోనే దేవర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇలా ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు.

ఇకపోతే ఎన్టీఆర్ సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సుమారు 6 సంవత్సరాలు అవుతుంది. దీంతో అభిమానులు ఈ సినిమా కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కానీ ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ టీజర్ కాస్త నిరాశకు గురిచేస్తుంది. దీంతో సినిమాపై అంచనాలు కూడా తగ్గాయి. వీటికి తోడు ఎన్టీఆర్ సినిమాను ఎన్నో బ్యాడ్ సెంటిమెంట్లు వెంటాడుతున్నాయని చెప్పాలి.

Also Read : NTR: ఆ క్షణం ఎంతో భయపడిపోయాను… సంచలన వ్యాఖ్యలు చేసిన ఎన్టీఆర్!

నిజానికి రాజమౌళి డైరెక్షన్లో ఏ హీరో సినిమా చేసిన తదుపరి సినిమా ఫ్లాప్ అవుతుంది. ఈ విషయాన్ని స్వయంగా ఎన్టీఆర్ కూడా ఓ సందర్భంలో ఒప్పుకున్నారు. ఇక రాజమౌళి సినిమా తర్వాత ఎన్టీఆర్ నటించిన సినిమా కావడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఎన్టీఆర్ తండ్రి కొడుకు పాత్రలలో ద్విపాత్రాభినయం చేసిన సినిమాలు కూడా గతంలో హిట్ కాలేదు.

ఆంధ్రావాలా, శక్తి సినిమాలలో ఈయన తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయంలో నటించారు. ఇప్పుడు దేవర సినిమాలో కూడా తండ్రి కొడుకులుగా కనిపించబోతున్నారని తెలియడంతో ఈ బాడ్ సెంటిమెంట్ కలవరపెడుతోంది. ఇక ఇటీవల దేవర సినిమా ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్ నోవాటేల్ హోటల్లో ఘనంగా నిర్వహించాలని భావించారు. కానీ భారీ స్థాయిలో అభిమానులు రావడంతో ఉన్నఫలంగా ఈ వేడుకను క్యాన్సిల్ చేశారు.

అయితే గతంలో ఎన్టీఆర్ నటించిన ఆంధ్రావాలా సినిమా వేడుకను కూడా ఇలా అర్ధాంతరంగా ఆపివేయాల్సి వచ్చింది. అయితే ఆ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది. దీంతో మరోసారి ఈ సెంటిమెంట్ దేవర సినిమా విషయంలో వర్క్ అవుట్ అవుతుందేమోనని అభిమానులు కంగారు వ్యక్తం చేస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం ఈ సినిమా విడుదలకు ముందే సరికొత్త రికార్డులను సృష్టించింది ఈసారి ఈ సెంటిమెంట్లు అన్నింటిని కూడా ఎన్టీఆర్ చరిపేస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి దేవర ఎలాంటి సక్సెస్ అందుకుంటుందనేది తెలియాలి అంటే 27వ తేదీ వరకు ఎదురుచూడాల్సిందే.

Share This Article
Exit mobile version