Ntr -Kalyan Ram: సినిమా ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. నందమూరి వారసులుగా ఇండస్ట్రీలో ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ హీరోలుగా కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే. హరికృష్ణ వారసులగా వీరిద్దరూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అయితే ఇండస్ట్రీలో హీరోగా ఎన్టీఆర్ ఎంతో మంచి సక్సెస్ అందుకోగా కళ్యాణ్ రామ్ మాత్రం సక్సెస్ అందుకోవడం కోసం ఎంతో కష్టపడుతున్నారు.
ఇక కళ్యాణ్ రామ్ హీరోగా పెద్దగా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోయినా నిర్మాతగా మాత్రం మంచి సక్సెస్ అయ్యారు. ఈయన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ స్థాపించి ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు అయితే తాజాగా ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా కూడా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై తెరికెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి ఆదరణ సొంతం చేసుకుంది.
Also Read :Niharika Konidela: వదిన ఇంట్లో ఉంటే చేసే పని అదే.. లావణ్య గుట్టు రట్టు చేసిన నిహారిక?
Devara Creating Distance Between NTR and Kalyan Ram
ఈ సినిమా కోసం దాదాపు 300 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారని తెలుస్తుంది. అటు కళ్యాణ్ రామ్, ఇటు ఎన్టీఆర్ కెరియర్ లోనే ఇది అత్యంత భారీ బడ్జెట్ చిత్రం కావటం విశేషం. అయితే ఈ సినిమా కారణంగా ఎన్టీఆర్ తన అన్నయ్య మధ్య విభేదాలు వచ్చాయని తెలుస్తోంది. ఇంత భారీ బడ్జెట్ సినిమా విడుదల అవుతుంది అంటే పెద్ద ఎత్తున నిర్మాతలు కూడా ప్రమోషన్లలో పాల్గొంటారు కానీ ఎన్టీఆర్ మాత్రమే ఈ సినిమా కోసం కష్టపడ్డారు.[[
ఈ సినిమాకు ఏ మాత్రం సంబంధంలేని ఆలియా భట్, సందీప్ రెడ్డి, సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ వంటి వారందరూ భాగమై ప్రమోషన్లు చేసినప్పటికీ కళ్యాణ్ రామ్ మాత్రం ఎక్కడా కనిపించకపోవడంతో పలువురికి పెద్ద ఎత్తున సందేహాలు వస్తున్నాయి. నందమూరి కుటుంబం ఎన్టీఆర్ ను దూరం పెట్టిన కళ్యాణ్ రామ్ మాత్రం తన తమ్ముడికి అండగా నిలిచారు.వీరిద్దరు రామలక్ష్మణులు మాదిరిగా ఉండేవారు అలాంటిది వీరి మధ్య ఏం జరిగి ఉంటుందని అభిమానులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అయితే వీరిద్దరి మధ్య గ్యాప్ వచ్చిందనే విషయంలో ఏ మాత్రం నిజం లేదని మరొక వాదన కూడా ఉంది. కళ్యాణ్ రామ్ ప్రస్తుతం తన సినిమా షూటింగ్ పనుల నిమిత్తం బిజీగా ఉన్న నేపథ్యంలోనే దేవర భారం మొత్తం ఎన్టీఆర్ కి ఇచ్చారని తెలుస్తోంది. అయితే ఈ సినిమా విడుదలైన తర్వాత కొరటాల శివ కళ్యాణ్ రామ్ మీడియా ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.