Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ దేవర. ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటివరకు విడుదలైన పాటలు, టీజర్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. అయితే తాజాగా ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ మాత్రం ప్రేక్షకులలో ఎక్కడో కాస్త నిరాశను కనబరుస్తుంది.
ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల ముంబైలో ఘనంగా ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ట్రైలర్ లాంచ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ చూసిన ఎంతోమంది అభిమానులు కాస్త నిరుత్సాహం వ్యక్తం చేయడమే కాకుండా ఆచార్యకు సీక్వెల్ అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు. ట్రైలర్ చూసిన తర్వాత సినిమా మీద అంచనాలు పెరగడం అటుంచితే మినిమమ్ బజ్ ని జెనరల్ ఆడియెన్స్ లో రేకెత్తించలేకపోయింది. దీంతో అభిమానులలో కూడా కాస్త నిరుత్సాహం కలుగుతుంది.
ఈ సినిమాకు ఇలాంటి టాక్ వస్తుందని భావించిన ఓ టాలీవుడ్ హీరో ఈ సినిమాని రిజెక్ట్ చేశారని తెలుస్తోంది. నిజానికి ఈ సినిమాకి ఫస్ట్ ఛాయిస్ ఎన్టీఆర్ కాదు. ఈ సినిమా 2020వ సంవత్సరంలోనే అల్లు అర్జున్ తో కొరటాల శివ అనౌన్స్ చేశారు.ఒక కాన్సెప్ట్ పోస్టర్ తో కూడా అల్లు అర్జున్ కొరటాల శివతో కొలాబరేట్ అవ్వడం ఆనందంగా ఉందని వెల్లడించారు. ప్రస్తుతం ఈ సినిమాని నిర్మిస్తున్న యువ సుధా ఆర్ట్స్ వారితోనే అప్పట్లో ఈ సినిమాని ప్రకటించారు కానీ ఈ సినిమా కథ విషయంలో ఎక్కడో చిన్న సందేహం రావడంతో అల్లు అర్జున్ ఈ సినిమా నుంచి తప్పుకున్నారని సమాచారం .
ఈ విధంగా అల్లు అర్జున్ తప్పుకోవడంతో ఎన్టీఆర్ బుక్కయ్యారని తెలుస్తుంది. మరి ఈ సినిమా విడుదలైన తర్వాత వచ్చే ఫలితం ఆధారంగా అల్లు అర్జున్ పూర్తిగా సేఫ్ అయ్యారా లేకపోతే ఓ మంచి సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్నారా అనేది తెలుస్తుంది. ఈ సినిమా ట్రైలర్ విడుదల తర్వాత ఈ సినిమా విషయంలో రాజమౌళి సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేలాగా ఉందని మరి కొంతమంది అభిమానులు కూడా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Devara : ఆందోళన పెడుతున్న దేవర రన్ టైం..థియేటర్లలో కూర్చొనిచ్చేనా..?