Pushpa 2: పుష్ప 2 ప్రతి సీన్ కు దిమ్మ తిరిగిపోతుంది… అంచనాలను పెంచేస్తున్న DSP?

2 Min Read

Pushpa 2: పుష్ప 2 ప్రతి సీన్ కు దిమ్మ తిరిగిపోతుంది… అంచనాలను పెంచేస్తున్న DSP?: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ త్వరలోనే పుష్ప 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికి విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల వాయిదా పడుతూ వస్తోంది అయితే డిసెంబర్ 6వ తేదీ ఎట్టి పరిస్థితులలోను ఈ సినిమా వెనకడుగు వేసే ప్రసక్తి లేదని కచ్చితంగా ప్రేక్షకుల ముందుకు వస్తుందని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.

ఇలా ఈ సినిమా డిసెంబర్ 6 న విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన పాటలు వీడియోలు చూస్తే కనుక ఈ సినిమాపై భారీ స్థాయిలోనే అంచనాలు పెరిగిపోతున్నాయి. పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన బన్నీ మరోసారి బాక్స్ ఆఫీస్ షేక్ చేయడానికి సిద్ధమవుతున్నారని చెప్పాలి.

Also Read : అల్లు అర్జున్ తో (Allu Arjun) కచ్చితంగా సినిమా ఉంటుంది.. ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్ చెప్పిన కొరటాల

ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్న దేవి శ్రీ ప్రసాద్ తాజాగా పుష్ప 2(Pushpa 2) సినిమా గురించి మాట్లాడుతూ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేశారు. ఈనెల 19న దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కాన్సర్ట్ గచ్చిబౌలి

నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన పుష్ప 2 గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.

పుష్ప 2 సినిమా అసలు తగ్గేదేలే అనే రేంజ్ లోనే ఉంటుందని తెలిపారు. సినిమా అదిరిపోయేలా వచ్చింది. ఇందులోని సీన్స్ అన్నీ చూశాక నా దిమ్మ తిరిగిపోయింది. పుష్ప వరల్డ్ ప్రారంభమయ్యాక ప్రతి సన్నివేశం ఇంటర్వెల్ లా ఉంటుంది. అడియన్స్ నిరాశ పరిచేలా ఒక్క సీన్ కూడా ఉండదు. దర్శకుడు సుకుమార్ స్క్రిప్ట్ చెప్పినప్పుడే నాకు చాలా బాగా నచ్చింది. ఆయన చెప్పిన విధంగానే సినిమా చేశారని ఇక బన్నీ యాక్టింగ్ వేరే లెవెల్ అంటూ ఈ సందర్భంగా పుష్ప సీక్వెల్ గురించి దేవిశ్రీప్రసాద్ చేసిన ఈ కామెంట్స్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేశాయి.

ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. నిజానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావలసి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడిన డిసెంబర్ ఆరో తేదీ భారీ స్థాయిలో పుష్పరాజ్ థియేటర్లలో ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారని చెప్పాలి.

Share This Article