నిరాశలో ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ట్రైలర్ పై దారుణంగా ట్రోల్స్.. కారణం?…..

4 Min Read

తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఎన్నో రకాల సినిమాలు తెరకెక్కుతున్నాయి. కానీ, అందులో కొన్ని మూవీస్ మాత్రమే పాన్ ఇండియా రేంజ్‌లో భారీ స్థాయిలో హైప్‌ని క్రియేట్ చేసుకుని సత్తా చాటుతున్నాయి. అలాంటి వాటిల్లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న ‘దేవర’ మూవీ ఒకటి. సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఈ చిత్రం మరికొద్ది రోజుల్లోనే ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ నేపధ్యంలో ‘దేవర’పై ఫ్యాన్స్ పెట్టుకున్న అంచనాలన్నీ రివర్స్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. అసలు ఇంతకీ ఇందుకు కారణం ఎవరు? అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ప్రెజెంట్ ఉన్న రోజుల్లో ఓ భారీ సినిమా వస్తుంది అంటే దానిపై చాలా కేర్ ఉంటుంది. ఒకప్పటిలా హాలీవుడ్ లో పలు క్రేజీ సీక్వెన్సులు కొట్టేసి మన దగ్గర తీసి చూపిస్తే జనం వావ్ అనుకునే పరిస్థితుల్లో అస్సలు లేరు. ఒక వావ్ అనిపించే సీన్ చూస్తే.. దాని రిలేటెడ్ ఒరిజినల్ సీన్ నెట్టింట్లో ఇట్టె దొరికేస్తుంది. అయినప్పటికీ చాలా మంది డైరెక్టర్లు, సంగీత దర్శకులు కొత్తదనం ట్రై చేయకుండా ప్రేరణ అంటూ ఆ కాపీల వెంట పడడమో లేదా తమ గత చిత్రాల షేడ్స్ నుంచి బయటకి రాలేకపోవడమో చేస్తున్నారు.

ఇప్పుడు సరిగ్గా ఇదే పరిస్థితిలో టాలీవుడ్ లో ఒకప్పుడు వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన దర్శకుడు కొరటాల శివ ఉన్నారని చెప్పాలి. తాను తీసిన ఇన్నేళ్ల సినిమాల్లో ఒక్క ప్లాప్ ‘ఆచార్య’ సినిమాతో వచ్చింది. ఈ సినిమా డిజప్పాయింట్మెంట్ తర్వాత ఎలాగైనా పెద్ద హిట్ కొట్టాలని నటుడు జూనియర్ ఎన్టీఆర్ తో అనౌన్స్ చేసిన మాస్ చిత్రమే “దేవర”. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఇదేదో వర్కౌట్ అయ్యేలానే ఉందనే చాలా మంది అనుకున్నారు. కానీ తాజాగా వచ్చిన ట్రైలర్ కట్ చూసిన తరువాత కొరటాల మళ్ళీ అదే రొటీన్ ప్లే ని అది కూడా ఎన్నో సినిమాలు నుంచి కాపీ కొట్టిన సీన్స్ తో తీసుకొస్తున్నాడు అని ట్రైలర్ చూశాక నెటిజన్స్ తేల్చిపారేస్తున్నారు. మెయిన్ గా ఈ ట్రైలర్ చూసాక చాలా సినిమాలే గుర్తొచ్చి ఉండొచ్చు.

లాస్ట్ సినిమా ఆచార్యతోనే మొదలు పెడితే అందులో పాదఘట్టం, సిద్ధవనం అనే రెండు ఫిక్షనల్ ప్రాంతాల్లానే ఇక్కడ కూడా ఒక ఫిక్షనల్ తీరా ప్రాంతం అక్కడ రెండు గ్యాంగ్ లని చూపిస్తున్నారు. అలాగే కొన్ని షాట్స్ కూడా ఆచార్య మూవీలో చూసినట్టే ఉన్నాయని నెటిజన్స్ అంటున్నారు. ఇక వీటితో పాటుగా సైఫ్ అలీఖాన్ రోల్, ఎన్టీఆర్ రోల్ మొదటి నుంచీ ఫ్రెండ్స్ అయినప్పటికీ ఎన్టీఆర్ కి తెలీకుండా సైఫ్ తప్పుడు పనులు చేయడం వంటివి అయితే “వాల్తేరు వీరయ్య”లో చిరంజీవి, ప్రకాష్ రాజ్ ల పాత్రలని గుర్తు చేసాయనే టాక్ వినిపిస్తోంది. ఇకపోతే ఇద్దరు ఎన్టీఆర్ లు ఒకరు ధైర్యవంతుడు, ఒకడు పిరికివాడు ఇదైతే ఎన్టీఆర్ చేసిన ‘అదుర్స్’ లో కూడా కనిపిస్తుంది. అలాగే రీసెంట్ మాస్ యాక్షన్ చిత్రం గోపీచంద్ నటించిన ‘భీమా’లో కూడా సేమ్ కాన్సెప్ట్ లోనే కనిపించాయి.

ఇక సినిమాలో ఒక కొడవలి లాంటి ఆయుధం ఒక లాంగ్ షాట్ లో ముసుగు వేసుకొని కొడవలి పట్టుకొని కనిపించే షాట్ ఓ హాలీవుడ్ యానిమేషన్ సినిమా నుంచి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఫైనల్ గా నీటిలో నుంచి సొర చేపతో గాల్లో ఎగిరే సీన్ చూస్తే విజువల్ వండర్ అవతార్ 2 లో తిమింగలంతో హీరో కొడుకు నీటిలో వెళ్లే సీన్ ఇంకా అది గాల్లో ఎగిరే సీన్స్ ని గుర్తు చేస్తుంది. అలాగే దీనికి ప్రభాస్ ఛత్రపతిలో సొర చేప సీన్ ని కూడా పోలుస్తున్నారు. ఇలా ఒక్క ట్రైలర్ లో ఇన్ని కాపీ ఎలిమెంట్స్ ఐతే ఈ మధ్య కాలంలో ఏ మూవీకి కూడా జరగలేదనే చెప్పాలి. దీనితో సోషల్ మీడియాలో దేవర ట్రైలర్ పై దారుణంగా ట్రోల్స్ పడుతున్నాయి.

ఇంకా కొందరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే దేవర పై పెట్టుకున్న అంచనాలు అన్నీ కూడా ప్రెజెంట్ తగ్గించుకుంటున్నారు. ఇలా దేవర ట్రైలర్ మాత్రం ఇపుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి దారుణమైన నిరాశనే మిగిల్చింది. మరి దీన్ని తట్టుకొని సినిమా థియేటర్స్ లో ఏదో న్యూ ఎలిమెంట్ చూపిస్తే తప్ప గట్టెక్కడం కష్టమే అని ట్రేడ్ లో కూడా ఆల్రెడీ టాక్ స్టార్ట్ అయినట్లు వినికిడి. మొత్తానికి అయితే ఆచార్య లాంటి భారీ డిజప్పాయింట్మెంట్ తర్వాత మళ్ళీ కొరటాల ఈ రేంజ్ లో డిజప్పాయింట్ చేస్తాడని అసలు ఎవరూ ఊహించి ఉండరు.

TAGGED:
Share This Article
Exit mobile version