నందమూరి హీరో రేర్ రికార్డ్.. వరల్డ్‌లో నెంబర్ 2 కి చేరిన జూనియర్ ఎన్టీఆర్….

2 Min Read


యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్లామర్ క్వీన్ జాన్వీ కపూర్ జంటగా.. సంచలన దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్ లో రూపొందిన దేవర మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. అంచనాలను మించి ఈ సినిమా వసూళ్లు సాధిస్తోంది. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై నందమూరి కల్యాణ్ రామ్, మిక్కిలేనేని సుధాకర్, హరికృష్ణ కే నిర్మించారు. ఇక ఈ మూవీ గత 3 రోజులుగా వసూలు చేసిన కలెక్షన్ల డీటెయిల్స్ లోకి వెళితే…

కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ నటించిన దేవర చిత్రం ఈనెల 27వ తేదీన విడుదలై సంచలన వసూళ్ల దిశగా పయనిస్తోంది. సినిమాకు మిక్సిడ్ టాక్ రావడంతో కలెక్షన్లు తగ్గుతాయని భావించినప్పటికీ టాక్ తో సంబంధం లేకుండా దూసుకుపోతోంది. కొంతమంది ఫస్ట్ పార్ట్ బాగుందంటుంటే మరికొందరు మాత్రం సెకండ్ పార్ట్ బాగుందంటున్నారు. సినిమాకు ఎన్టీఆర్, అనిరుధ్ రవిచందర్ మూలస్తంభాలుగా నిలిచారు. మొదటి నాలుగు రోజుల్లోనే కొన్ని ప్రాంతాల్లో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించింది.

Also Read :Bigg Boss House Rules : మారిన రూల్…ఇది గమనించారా?

ఈ నెల రెండోతేదీన గాంధీ జయంతి కావడంతో సెలవు దినం. తర్వాత మూడో తేదీ నుంచి 12 వ తేదీ వరకు వరుసగా దసరా హాలిడేస్ ఉన్నాయి. వీటిని అనుకూలంగా మార్చుకుంటే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుంది. ఫస్ట్ వీక్ లో వరల్డ్ వైడ్ గా 32.93 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. హాలీవుడ్ సినిమాలను కూడా వెనక్కి నెట్టి అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా దేవరతో జూనియర్ ఎన్టీఆర్ అరుదైన ఫీట్ సాధించాడు. గత వారంలో హాలీవుడ్ మూవీ ది వైల్డ్ రోబో 44 మిలియన్ల వసూళ్లు సాధించింది.

మూడు రోజుల్లోనే 32.93 మిలియన్లు రాబట్టి దేవర రెండో స్థానంలో నిలవడం విశేషం. ఉత్తర అమెరికాలో 5.12 మిలియన్ డాలర్లు వసూలు చేసి నాలుగో స్థానంలో నిలిచింది. ఏపీ, తెలంగాణ నుంచి వచ్చిన వసూళ్లు ప్రపంచ వ్యాప్తంగా దేవరను రెండో స్థానంలో నిలబెట్టాయి. సోమవారం కూడా మంచి కలెక్షన్లు రాబట్టిన దేవర మండే టెస్ట్ లో ఉత్తీర్ణత సాధించినట్లే. ఇక దసరా సెలవులతో భారీ వసూళ్లు సాధించే అవకాశం కనపడుతోంది. అమెరికన్ సినిమా బీటెల్ జ్యూస్ 29.64 మిలియన్ డాలర్లు, ట్రాన్స్ ఫార్మర్స్ వన్ 25.90 మిలియన్ డాలర్లు, స్పీక్ నో ఇవిల్ 9.6 మిలియన్ డాలర్లతో టాప్ 5 లో నిలిచాయి.

Share This Article