Deepika Padukone : బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటి దీపికా పదుకొనే ఒకరు. ఈమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన సినిమాలలో నటించే అవకాశాలను అందుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న దీపిక పదుకొనే మరో స్టార్ హీరో రణవీర్ సింగ్ ను ప్రేమించి పెద్దల సమక్షంలో 2018 వ సంవత్సరంలో ఇటలీలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు..
ఇలా పెళ్లి తర్వాత కూడా దీపికా(Deepika Padukone) రణబీర్ ఇద్దరు కూడా సినిమా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతూ వచ్చారు. ఇలా పెళ్లయిన ఇన్ని సంవత్సరాలకు ఈ జంట పిల్లలని ప్లాన్ చేశారు. ఈ ఏడాది మొదట్లో దీపికా పదుకొనే తన ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేస్తూ శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు. ఇలా అప్పటి నుంచి తన ప్రేగ్నెన్సీకి సంబంధించిన విషయాలను ఈమె సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ వచ్చారు..
Also Read : Nebula-1 rocket : చైనా ఆశయాలకు షాక్? ల్యాండింగ్ సమయంలో పేలిన రాకెట్ భారీ నష్టం
Deepika Padukone Names Her Daughter – Do You Know the Meaning Behind It?
ఇకపోతే సెప్టెంబర్ 8వ తేదీ దీపిక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. అయితే ఇప్పటివరకు తన కూతురు ఎలా ఉంటుంది ఏంటి అనే విషయాలను మాత్రం ఈమె రివీల్ చేయకపోవడంతో తన కుమార్తెను చూపించాలి అంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున కామెంట్లు చేశారు. అయితే దీపావళి పండుగను పురస్కరించుకొని ఈమె తన కుమార్తె ఫోటోలతో పాటు తన కుమార్తెకు ఏ పేరు పెట్టారనే విషయాన్ని కూడా వెల్లడించారు.
తాజాగా దీపికా పదుకొనే తన కుమార్తెకు నామకరణం కూడా ఘనంగా నిర్వహించారని తెలుస్తుంది. తన కుమార్తెకు దీపికా పదుకొనే దువా పదుకొణె సింగ్ అని నామకరణం చేసినట్లు తెలియజేశారు. ఇక తన కుమార్తె పేరు దువా అంటే ప్రార్థన. మా ప్రేయర్స్కు సమాధానమే ఈమె అంటూ తన కుమార్తె పాదాల ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
ఈ విధంగా దీపికా పదుకొనే తన కుమార్తెకు దువా అని నామకరణంతో పాటు తన పేరు తన భర్త రణవీర్ సింగ్ పేరును కూడా చేర్చారు. ఇక ఈమె తన కుమార్తె పేరును రివిల్ చేయడంతో ఎంతోమంది బాలీవుడ్ సెలబ్రిటీలను స్పందిస్తూ శుభకాంక్షలు తెలిపారు. ఇక అభిమానులు కూడా తన కుమార్తె పేరు చాలా అద్భుతంగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక దీపికా పదుకొనే చివరిగా ప్రభాస్ నటించిన కల్కి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.