Chiranjeevi : కొడుకు కోడలు కోసం అక్కడ ఖరీదైన ప్రాపర్టీ కొన్న చిరంజీవి?

2 Min Read

Chiranjeevi : సాధారణంగా సినిమా సెలబ్రిటీలు వారి పనులలో ఎంతో బిజీగా ఉన్న నేపథ్యంలో కొంత సమయం పాటు విశ్రాంతి తీసుకోవడం కోసం లేదంటే ఫ్యామిలీతో కలిసి ఎక్కడికైనా వెకేషన్ వెళ్ళండం చేస్తుంటారు. ఈ విధంగా ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు ఎంతో అందమైన ప్రాంతాలలో ఆస్తులను కొనుగోలు చేసి అక్కడ ఫామ్ హౌస్ ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇలా వేసవికాలం వచ్చింది అంటే చాలామంది చల్లని ప్రదేశాలకు వెళుతూ ఉంటారు.

ఇకపోతే ఊటీలో ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు పెద్ద ఎత్తున స్థలాలను కొనుగోలు చేసి ఫామ్ హౌస్లను ఏర్పాటు చేశారు. ఇక ఊటీ కొండల నడుమ ఒక ఖరీదైన ప్రాపర్టీని చిరంజీవి కూడా కొనుగోలు చేశారని తెలుస్తోంది. సుమారు 16 కోట్ల రూపాయలు ఖర్చు చేసి చిరంజీవి(Chiranjeevi) ఈ ఆస్తులను కొనుగోలు చేశారట. కొండల చుట్టూ కాఫీ తోటలు కలిగి ఉన్నటువంటి ఈ స్థలం ఎంతో ఆహ్లాదకరంగా ఉందని తెలుస్తుంది. ఇప్పటికే రామ్ చరణ్ ఉపాసన కూడా ఈ స్థలాన్ని చూసి వచ్చారని సమాచారం.

Also Read :Ramcharan: చరణ్ సినీ కెరియర్ లోనే షూటింగ్ మధ్యలో ఆగిపోయిన సినిమా ఏంటో తెలుసా?

ఇలా తన కొడుకు కోడలు కోసమే చిరంజీవి ఊటీలో ఈ ఆస్తి కొనుగోలు చేశారని తెలుస్తోంది. ఇక ఈ స్థలంలో చిరంజీవి ఒక అద్భుతమైన ఫామ్ హౌస్ నిర్మించబోతున్నారని సమాచారం. అయితే ఈ విషయం ఇంకా కన్‌ఫర్మ్‌ అవ్వలేదు. ఇదిలా ఉంటే.. చిరంజీవికి బెంగళూరు కెంపెగూడ అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గరలోని దేవనహళ్లిలో ఓ విలాసవంతమైన ఫామ్‌హౌస్‌ ఉంది. ఇలా బెంగళూరు చెన్నై ముంబై వంటి ప్రాంతాలలో చిరంజీవి ఇప్పటికే పెద్ద ఎత్తున ఆస్తులను కొనుగోలు చేశారు.

మరి ఊటీలో కొనుగోలు చేసిన ఈ ప్రాపర్టీలో చిరంజీవి ఏం నిర్మించబోతున్నారు ఏంటి అనేది తెలియాల్సి ఉంది. ఇక చిరంజీవి సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈయన వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటుంది. అయితే వచ్చే ఏడాది సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి నెలలో ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుందని తెలుస్తోంది. ఇక ఇందులో చిరంజీవికి జోడిగా త్రిష హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

Share This Article
Exit mobile version