Samantha: నాగచైతన్యకు లీగల్ నోటీస్ పంపిన సమంత… టైం చూసి కొట్టిందిగా?

2 Min Read

Samantha: సమంత నాగచైతన్య టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున వార్తలలో నిలిచారు. వీరిద్దరూ కలిసి ఏం మాయ చేసావే సినిమాలో నటించారు. ఆ సినిమా సమయంలోనే ప్రేమలో పడిన ఈ జంట కొంతకాలం పాటు ప్రేమలో ఉండి అనంతరం పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఇలా వివాహం తర్వాత కొంతకాలం పాటు ఎంతో సంతోషంగా ఉన్న వీరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకొని విడిపోయారు.

సమంత నాగచైతన్య విడిపోయిన తర్వాత ఎవరికి వారు తమ కెరియర్ పై ఫోకస్ పెట్టారు. అయితే నాగచైతన్య సమంత తన వ్యక్తిగత జీవితంలో ఒక అడుగు ముందుకు వేసి రెండో పెళ్లికి సిద్ధమయ్యారు. అయితే ఈయన నటి శోభితను రెండో పెళ్లి చేసుకోబోతున్నారని విషయం తెలిసిన తర్వాత సమంత నాగచైతన్య మరోసారి వార్తల్లో నిలిచారు. ఇప్పటికే నాగచైతన్య శోభిత నిశ్చితార్థం ఎంతో ఘనంగా జరిగింది. వీరి వివాహం డిసెంబర్ 4వ తేదీ జరగబోతుందని తెలుస్తుంది.

ఇలా నాగచైతన్య రెండో పెళ్లికి సిద్ధమవుతున్న తరుణంలో సమంత తనకు లీగల్ నోటీసులు పంపించబోతున్నారని తెలుస్తోంది. వీరిద్దరి వివాహం జరిగిన తర్వాత ఇద్దరు కలిసి ఒక ఫ్లాట్ కొనుక్కొని చేశారు. దానిని వారి ఇష్టానికి అనుగుణంగా ఇంటీరియర్ డిజైన్ చేయించి ఎంతో అందంగా తీర్చిదిద్దారు. అయితే ఈ ఇంటి విషయంలో సమంత అధికంగా డబ్బు ఖర్చు పెట్టిందని తెలుస్తుంది.

ఇలా సమంత నాగచైతన్య కలిసి కొనుగోలు చేసిన ఈ ఫ్లాట్ ని నాగచైతన్య తనకు కాబోయే భార్య శోభితకు గిఫ్టుగా రాసి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారట .ఈ విషయంపై సమంత నాగచైతన్యకు లీగల్ నోటీసులు పంపించబోతున్నారని తెలుస్తోంది. తాను ఎంతో ఇష్టంగా కొనుగోలు చేసిన ఆ ఫ్లాట్ ను మరెవరికో గిఫ్ట్ గా రాసిస్తాను అంటే నేను ఎలా ఒప్పుకుంటాను అంటూ సమంత తన స్నేహితుల వద్ద చెప్పినట్టు సమాచారం.

అయితే ఈ విషయంపై నెటిజెన్స్ కూడా సమంతకు మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు. ఇక నాగచైతన్య శోభిత పెళ్లి జరిగిన తర్వాత ఇద్దరు ఇదే ఫ్లాట్ లో ఉండాలని నాగచైతన్య నిర్ణయం తీసుకున్నప్పటికీ శోభిత మాత్రం అందుకు ఒప్పుకోలేదని ఈ విషయం గురించి కూడా ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవలు జరిగాయంటూ కూడా వార్తలు హల్చల్ చేస్తున్నాయి.

Share This Article