Bigg Boss House Rules : బిగ్ బాస్ తెలుగు సీజన్8 కార్యక్రమం ప్రారంభం అయ్యి మరొక రెండు రోజుల పూర్తి చేసుకుంటే రెండు వారాలు అవుతుంది 14 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ఇప్పటికే ఒక కంటెస్టెంట్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. మొదటి వారమే బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయ్యారు. ఇక రెండో వారంలో భాగంగా మరి కొంత మంది కంటెస్టెంట్లు నామినేషన్స్ లో ఉన్నారు. అయితే ఈ వారం కిరాక్ సీత హౌస్ నుంచి బయటకు వస్తుంది అంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఇక బిగ్ బాస్ కార్యక్రమం అంటే హౌస్ లో ఎన్నో గొడవలు కొట్లాటలు సర్వసాధారణం అలాగే ప్రేమ వ్యవహారాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనే కంటెస్టెంట్లకు బిగ్ బాస్ కొన్ని కఠినమైన రూల్స్ కూడా పెడుతుంది. ఇది తెలుగు సీసన్ కావడంతో కంటెస్టెంట్లు మొత్తం తెలుగులోనే మాట్లాడాలి అనే రూల్ మొదటి సీజన్ నుంచి కొనసాగుతూ వచ్చేది. కానీ గత రెండు మూడు సీజన్ల నుంచి ఈ రూల్ పెద్దగా ఫాలో అవడం లేదని తెలుస్తోంది.
Also Read: Bigg Boss 8: దుమ్ము లేపుతున్న బిగ్ బాస్ 8 .. లాంచింగ్ ఎపిసోడ్ రేటింగ్ ఎంతో తెలుసా?
Change in Telugu Bigg Boss House Rules
తెలుగు రాని వారికి కూడా తెలుగు నేర్పించే బాధ్యతను బిగ్ బాస్ (Bigg Boss House Rules)అప్పగించేవారు కానీ ప్రస్తుత సీజన్లలో మాత్రం తెలుగు వచ్చిన వారు కూడా ఇంగ్లీష్ లోనే మాట్లాడుతున్నారు. స్వయంగా హోస్ట్ నాగార్జునతో సైతం ఇంగ్లీషులోనే మాట్లాడుతూ ఉన్నప్పటికీ బిగ్ బాస్ ఎలాంటి ఆంక్షలు విధించలేదు. దీంతో హౌస్ లో తెలుగులోనే మాట్లాడాలి అనే రూల్స్ మార్చారని తెలుస్తోంది. అంతేకాకుండా పగలు నిద్రపోతే గతంలో కుక్క అరుపు వినిపించేది దాంతో ఆ కంటెస్టెంట్ కి పనిష్మెంట్ ఉండేది. ఇప్పుడు పగలు నిద్రపోయిన పెద్దగా పట్టించుకోవడం లేదు, అలాగే స్మోకింగ్ ఏరియాని కూడా పెద్దగా చూపించకపోవడంతో కంటెస్టెంట్ ల ప్రైవసీకి బిగ్ బాస్ ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుస్తోంది.
ఇక ఎనిమిదవ సీజన్ మొదటి వారం చాలా బోరింగ్ అనిపించింది. కానీ రెండవ వారంలో భాగంగా టాస్కులలో పాల్గొనడం పెద్ద ఎత్తున గొడవలు జరగడంతో ప్రేక్షకులకు కావలసిన మంచి కంటెంట్ అందిస్తున్న నేపథ్యంలో ఎంతో ఆసక్తికరంగా మారింది. మరి ఈ రెండవ వారంలో భాగంగా ఎవరు హౌస్ నుంచి బయటకు రాబోతున్నారు అనేది తెలియాల్సి ఉంది.