Chandra Babu Naidu : ఆహా ఓటీటీలో బాలకృష్ణ హోస్ట్ గా అన్‌స్టాపబుల్ సీజన్ 4 అక్టోబర్ 25వ తేదీ నుంచి ప్రసారమవుతుంది. ఇక ఇటీవల మొదటి ఎపిసోడ్ ప్రసారం కావడంతో భారీ స్థాయిలో ఆదరణ లభించింది. మొదటి ఎపిసోడ్ గెస్ట్ గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన గత ఐదు సంవత్సరాల కాలంలో ఆయన రాజకీయంగా వ్యక్తిగతంగా ఎదుర్కొన్న ఇబ్బందులు, అలాగే జైలు జీవితం, పవన్ కళ్యాణ్ తో పొత్తు గురించి ఎన్నో విషయాలు వెల్లడించారు.
ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ చంద్రబాబు నాయుడు(Chandra Babu Naidu) జైలు జీవితం గురించి ప్రశ్నలు వేశారు. ఈ ప్రశ్నకు చంద్రబాబు సమాధానం చెబుతూ ఆ రోజు నంద్యాలలో పర్యటన పూర్తి చేసుకొని బస్సులో రెస్ట్ తీసుకుంటున్నాను కానీ బయట చాలా అలజడి సృష్టించారు. ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ అంటూ తనని నంద్యాల, ప్రకాశం జిల్లా రోడ్డు మార్గాన అడవులలో అమరావతికి తీసుకు వచ్చారని బాబు తెలిపారు.
Also Read : CM Chandrababu :తిరుపతి లడ్డూలలో జంతువుల కొవ్వు.. సీఎం చంద్రబాబు సంచలన ఆరోపణలు
Chandra babu Naidu Recounts Near-Death Experience in Jail
ఇక ఆరోజు రాత్రంతా ఇన్వెస్టిగేషన్ పేరుతో అక్కడ ఇక్కడ తిప్పుతూ తెల్లవారేసరికి మెడికల్ టెస్టులకి పంపించారు. ఆ తర్వాత తనని అక్కడ ఇక్కడ తిప్పుతూ కోర్టుకు తీసుకువెళ్లారు. కోర్టులో కూడా భారీ స్థాయిలో ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. చివరికి అర్ధరాత్రి రాజమండ్రి జైలుకు పంపించారు. ఆరోజు రాత్రి చేయని తప్పుకు నన్ను అరెస్టు చేయడం నన్ను అరెస్టు చేసిన విధానం తలుచుకుంటే గుండె బరువెక్కి పోతుంది. ఇప్పటికీ నా అరెస్టు విషయాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నానని చంద్రబాబు తెలిపారు.
జైలుకు వెళ్లిన తర్వాత అక్కడ సందేహంగా కొన్ని సంఘటనలు జరిగాయి. అయినా నేను భయపడలేదు ధైర్యంగా ఎదుర్కొన్నాను కాబట్టి ఏం జరగలేదు లేకపోతే ఏం జరిగి ఉండేదో తెలియదని చంద్రబాబు తెలిపారు. నేను చనిపోతే ఒక్కక్షణం. కానీ నేను అనుకున్న ఆశయం కోసం పని చేస్తే అది శాశ్వతంగా ఉంటుంది. అదే నన్ను ముందుకు నడిపించింది. మన చావు గురించి ఆలోచిస్తే జీవితంలో ఏదీ చేయలేము అంటూ ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.