Prabhas : జనమంతా ఇన్ స్టాలో ప్రభాస్ ను ఫాలో అవుతుంటే.. కానీ ఆయన ఫాలో అయ్యేది మాత్రం ఈ 23 మందినే..!

2 Min Read

Prabhas : ఇండియన్ బాక్సాఫీస్ కింగ్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సలార్, కల్కి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న ప్రభాస్ ఇప్పుడు మారుతీ దర్శకత్వంలో రాజాసాబ్, సలార్ 2, కల్కి 2 వంటి చిత్రాలతో బిజీ షెడ్యూల్‌ను కొనసాగిస్తున్నాడు. వీటిలో రాజాసాబ్ వచ్చే ఏడాది ఏప్రిల్ 10న థియేటర్లలోకి రానుంది. హారర్ కామెడీ నేపథ్యంలో ఈ సినిమా చేయడం ప్రభాస్ కెరీర్‌లో ఇదే తొలిసారి.

అలాగే సందీప్ రెడ్డి వంగాతో తీస్తున్న యాక్షన్ సినిమా స్పిరిట్, అలాగే హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సినిమాల సంగతి పక్కన పెడితే.. ప్రభాస్(Prabhas) బయట ఎక్కువగా కనిపించడు. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉండడు. మా డార్లింగ్ సినిమాలను ప్రమోట్ చేయడం తప్ప సోషల్ మీడియాలో మరే ఇతర విషయాలను షేర్ చేయడని ప్రభాస్ అభిమానులు కాస్త నిరాశను వ్యక్తం చేస్తూనే ఉంటారు..

Also Read : Manchu Manoj: మోహన్ బాబు యూనివర్సిటీలో ఇంత మోసమా.. నిజాలు బయటపెట్టిన మంచు మనోజ్..!

Prabhas instagram

అయితే, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ఎక్స్ (ట్విట్టర్), ఇతర సోషల్ మీడియాలో ప్రభాస్‌కు భారీ సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రభాస్‌ను 12.8 మిలియన్ల మంది సభ్యులు ఫాలో అవుతుంటారు. అయితే 12 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్న ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్‌లో కేవలం 23 మందిని మాత్రమే ఫాలో అవుతున్నాడు. ఈ లిస్ట్‌లో మొదటగా కనిపించే పేరు ప్రభాస్ పెద్దనాన్న, దివంగత హీరో కృష్ణంరాజు.

నాగ్ అశ్విన్, ఓం రౌత్, మారుతీ, హను రాఘవపూడి, సందీప్ రెడ్డి వంగా, రాధేశ్యామ్ ఫేమ్ రాధాకృష్ణ, సుజీత్‌లను కూడా ప్రభాస్ ఫాలో అవుతున్నాడు. వీరితో పాటు గ్లోబల్ స్టార్ కమల్ హాసన్, బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, కన్నడ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, బాలీవుడ్ నటుడు సన్నీ సింగ్, హీరోయిన్ శ్రుతి హాసన్, దీపికా పదుకొనే, నటి రిద్ధి కుమార్, శ్రద్ధా కపూర్, పూజా హెగ్డే, సీనియర్ నటి భాగ్య శ్రీ, నిధి అగర్వాల్, మాళవిక మోహన్, యువ కథానాయిక ఇమాన్వి, ఫిల్మ్ యాక్షన్ యూనిట్ ఎడిటర్ డిబి బ్రాకమోంటెస్ ప్రభాస్ జాబితాలో ఉన్నారు.

Share This Article
Exit mobile version