Car buying tips : కొత్త కారు కొంటున్నారా.. ఈ ట్రిక్ తో ఆన్ రోడ్ ప్రైజ్ తగ్గించుకోండి

2 Min Read

Car buying tips : పండుగ సీజన్‌లో కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? కొత్త కారును కొనుగోలు చేసే ముందు, కొత్త కారును కొనుగోలు చేసేటప్పుడు .. కార్ ఆన్‌రోడ్ ధరను ఎలా తగ్గించవచ్చనే దాని గురించి సమాచారం తెలుసుకుంటే చాలా ఉపయోగంగా ఉంటుంది. ఆన్-రోడ్ ధరకు అనేక ఇతర అంశాలు జోడించకపోవడంతో వాహనం ఎక్స్-షోరూమ్ ధర తగ్గుతుంది.

కార్ షోరూమ్‌కి వెళ్లిన తర్వాత మీకు నచ్చిన కారు ధరల లిస్ట్ ఇస్తారు. ఈ ధరల జాబితాను జాగ్రత్తగా పరిశీలిస్తే, మీకు అవసరం లేని ఎక్స్-షోరూమ్ కాకుండా అనేక అంశాలు కనిపిస్తాయి.. కానీ అవి ఆ జాబితాలో ఉంటాయి. ఇవి కారు ఆన్-రోడ్ ధరను పెంచుతాయి. ఆన్-రోడ్ ధరను ఎలా తగ్గించవచ్చో ఈ చిన్న ట్రిక్ (Car buying tips)సాయంతో తెలుసుకుందాం.

Also Read : BMW Cars Discounts: త్వరపడండి.. బీఎండబ్ల్యూ కార్లపై ఏకంగా రూ.7లక్షల డిస్కౌంట్

షోరూమ్ నుండి కారు ఇన్సురెన్స్ కొనుగోలు చేయకూడదు. అది షోరూమ్ లో కాస్త ఎక్కువగా ఉంటుంది. అందుకే చాలా సార్లు, చాలా మంది వ్యక్తులు కారు ఇన్స్ రెన్స్ ను షోరూమ్ నుండి కొనుగోలు చేయకుండా బయటి నుండి కొనుగోలు చేస్తారు. షోరూమ్‌కు బదులుగా బయటి నుండి ఇన్స్ రెన్స్ చేయించుకుంటే కాస్త తగ్గుతుంది.

కొత్త కారు కొనుగోలు చేసేటప్పుడు మీరు ఈ చిట్కాను ప్రయత్నించవచ్చు. ఇన్సూరెన్స్ షోరూమ్ నుండి కొనుగోలు చేయాలా లేదా బయటి నుండి కొనుగోలు చేయాలా అనేది మీ నిర్ణయం. కానీ షోరూమ్, బయటి నుండి అందుకున్న ధరలో తేడా మీకు స్పష్టంగా కనిపిస్తుంది. కానీ, డెలివరీ తీసుకోవడానికి మీతో పాటు ఇన్స్ రెన్స్ కాపీని తీసుకెళ్లినప్పుడు మాత్రమే కొత్త కారు షోరూమ్ నుండి బయటకు వస్తుంది.

ఇన్స్ రెన్స్ కాకుండా, మీరు కారుతో ఎక్స్ టెండెడ్ వారంటీని తీసుకోకూడదనుకుంటే దానిని కూడా తీసివేయవచ్చు, ఎందుకంటే ఎక్స్ టెండెడ్ వారంటీ తీసుకోవాలా వద్దా అనేది మీ ఇష్టం. ఈ రెండు పనులు చేసిన తర్వాత, మీ కారు ఆన్-రోడ్ ధర మునుపటి కంటే ఇప్పుడు చాలా తక్కువగా ఉంటుంది.

కార్ కొనుగోలు చిట్కాలు: ఈ విషయాలను కూడా గమనించాలి
ఫైనాన్సింగ్ ఎంపికలు: మీరు కారుకు ఫైనాన్స్ చేయాలనుకుంటే, వివిధ బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీల వడ్డీ రేట్లను సరిపోల్చండి. చాలా కంపెనీలు ఎక్కువ వడ్డీ రేటును వసూలు చేస్తాయి. మరొక కంపెనీ తక్కువ వడ్డీ రేటుకే ఫైనాన్స్ అందిస్తాయి.


ఆఫర్‌లు: కొన్నిసార్లు కొంతమంది డీలర్లు పండుగ సీజన్‌లో డిస్కౌంట్లు, గొప్ప ఆఫర్‌లను కూడా అందిస్తారు. సరైన సమయంలో కారు కొనడం ద్వారా, మీరు కారు కొనుగోలు చేసేటప్పుడు డబ్బు ఆదా చేసుకోవచ్చు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని కారును తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.

Share This Article
Exit mobile version