రాయల్ ఎన్ ఫీల్డ్ ప్రియులకు గుడ్ న్యూస్.. మార్కెట్లోకి Bullet 350 Battalion Black.. ధరెంతో తెలుసా ?

2 Min Read

Bullet 350 Battalion Black: రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త బుల్లెట్ 350 ‘బెటాలియన్ బ్లాక్’ ఎడిషన్‌ను పరిచయం చేసింది. ఈ కొత్త బైక్ బెంచ్ సీటు, హ్యాండ్ పెయింటెడ్ గోల్డ్ పిన్‌స్ట్రైప్స్, సిగ్నేచర్ బుల్లెట్ ట్యాంక్, సైడ్ ప్యానెల్‌లపై 3D బ్యాడ్జ్‌లు వంటి ఆకర్షణీయమైన డిజైన్ ఎలిమెంట్‌లను కలిగి ఉంది. ఇక సమీప భవిష్యతులో అత్యంత వేగంగా అమ్ముడయ్యే బైక్ గా నిలుస్తుందని కంపెనీ భావిస్తోంది. దీని ధర రూ. 1,74,730 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). దీని బుకింగ్, టెస్ట్ రైడ్ నేటి నుండి అంటే 13 సెప్టెంబర్ 2024 నుండి ప్రారంభమైంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ ఇప్పటికే మార్కెట్లో తన హవాన కొనసాగిస్తోంది. 90 ఏళ్ల నాటి బుల్లెట్ ఇప్పుడు నయా రూపు సంతరించుకుంది. కొత్త బుల్లెట్ కోసం కంపెనీ కొత్త డిజైన్ ‘బెటాలియన్ బ్లాక్’ ఎడిషన్‌ను పరిచయం చేసింది. తమకు ఇష్టమైన బైక్‌లో పాత స్టైల్ కావాలనుకునే వారికి ఇది ప్రత్యేకం. రాయల్ ఎన్ఫీల్డ్ ఈ మోడల్‌లో బెంచ్ సీటు, పాతకాలపు శైలి టెయిల్ లైట్, ట్యాంక్‌పై చేతితో పెయింట్ చేసిన బంగారు పిన్‌స్ట్రైప్స్ , సైడ్ ప్యానెల్ బ్యాడ్జ్‌లు వంటి కొన్ని పాతకాలపు డిజైన్‌లను తిరిగి తీసుకురావడం ద్వారా జ్ఞాపకాలను రిఫ్రెష్ చేసింది. ఇది కాకుండా, స్పోక్ వీల్స్‌తో క్రోమ్ రిమ్, బ్లాక్ మిర్రర్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇది సింగిల్ ఛానల్ ABSతో పాటు 300ఎంఎం ఫ్రంట్ డిస్క్, 153ఎంఎం వెనుక డ్రమ్ బ్రేక్ కూడా కలిగి ఉంది.

బుల్లెట్ 350 బెటాలియన్ బ్లాక్‌ను విడుదల చేసిన సందర్భంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ యద్వీందర్ సింగ్ గులేరియా మాట్లాడుతూ.. తరతరాలుగా మన జీవితంలో బుల్లెట్ ఒక ముఖ్యమైన భాగమన్నారు. కొత్త బెటాలియన్ బ్లాక్ ఎడిషన్ మా కమ్యూనిటీకి.. బుల్లెట్ నే ఐడెంటిటీగా భావిచే రైడర్లకు సరికొత్త అనుభూతి అన్నారు. ఇది బుల్లెట్ వారసత్వ వేడుకగా పేర్కొన్నారు. ఇందులో పాత డిజైన్, అద్భుతమైన రైడింగ్ అనుభవాన్ని కలించేలా శ్రద్ధ తీసుకున్నారు. ‘బెటాలియన్ బ్లాక్’ ఎడిషన్ రాయల్ ఎన్‌ఫీల్డ్ దేశ వ్యాప్తంగా 25 కంటే ఎక్కువ రాయల్ ఎన్ఫీల్డ్ స్టోర్లలో టెస్ట్ రైడ్ కోసం అందుబాటులో ఉంది.

అద్భుతంగా రూపొందించబడిన బుల్లెట్ ‘బెటాలియన్ బ్లాక్’ ఎడిషన్ J-ప్లాట్‌ఫారమ్‌లో నిర్మించబడింది, ఇది మెరుగైన పనితీరును, విశ్వసనీయమైన రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఇది శక్తివంతమైన 349సీసీ ఇంజిన్‌ను కలిగి ఉంది, ఇది 6100rpm వద్ద 20.2ps శక్తిని.. 4000rpm వద్ద 27nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. బెటాలియన్ బ్లాక్ ఎడిషన్ మిలిటరీ వేరియంట్ పైన రూపొందంది. ఇది కాకుండా, బ్లాక్ గోల్డ్ మరియు స్టాండర్డ్ మోడల్‌లు వరుసగా టాప్, మిడ్ వేరియంట్‌లుగా అందుబాటులో ఉన్నాయి.

TAGGED:
Share This Article
Exit mobile version