Bigg Boss 8 : వైల్డ్ కార్డు ఎంట్రీ కంటెస్టెంట్ ను రివీల్ చేసిన బిగ్ బాస్ ఎవరో తెలుసా?

2 Min Read

Bigg Boss 8 : బుల్లితెర పై ప్రసారమవుతూ ఎంతమంది అభిమానులను సొంతం చేసుకున్న కార్యక్రమాలలో బిగ్ బాస్ కార్యక్రమం ఒకటి . ఈ కార్యక్రమం వివిధ భాషల్లో ప్రసారం అవుతూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఇక ఈ కార్యక్రమం తెలుగులో కూడా ఏడు సీజన్లను పూర్తిచేసుకుని ఎనిమిదవ సీజన్ కూడా ప్రారంభమైంది. ఇప్పటికే 8వ సీజన్ 4 వారాలను పూర్తిచేసుకుని హౌస్ నుంచి నలుగురు కంటెస్టెంట్లు బయటకు వచ్చారు.

ఇక ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా ఉంటుందని తెలుస్తుంది. అలాగే వీకెండ్ ఎలిమినేషన్ కూడా ఉండడంతో ఇద్దరు కంటెస్టెంట్లు హౌస్ నుంచి బయటకు రాబోతున్నారు. 14 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ కార్యక్రమం నుంచి ఈ వారం పూర్తి అయ్యేసరికి ఆరుగురు హౌస్ నుంచి ఎలిమినేట్ కాగా 5 వ వారం మరో 8 మంది కంటెస్టెంట్ లో వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నారని తెలుస్తుంది. ఇప్పటికే వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి వెళ్లబోయే వారి పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read : Bigg Boss House Rules : మారిన రూల్…ఇది గమనించారా?

ఇక ఈ వైల్డ్ కార్డు ద్వారా కొత్తవారు కాకుండా గత సీజన్లో పాల్గొన్న బిగ్ బాస్(Bigg Boss 8 ) కంటెస్టెంట్ లే హౌస్ లోకి వెళ్ళబోతున్నారని తెలుస్తోంది. ఇకపోతే తాజాగా సీజన్ 8 ఫస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కంటెస్టెంట్ టేస్టీ తేజా పేరును అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు బిబి టీమ్. ఇన్ స్టాగ్రామ్ లో స్టార్ మా, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ రెండు అఫీషియల్ పేజీలలో కంటెస్టెంట్ ఎవరో కనిపెట్టండి అంటు పోస్ట్ వేశారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే..

తేజ ఫేస్ కనపడకుండా కేవలం ఆయన షాడోని షేర్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి వైల్డ్ కార్డు కంటెస్టెంట్ ఎవరో కనిపెట్టండి అంటూ పోస్ట్ చేశారు. దీంతో ఆ కంటెస్టెంట్ పక్కా టేస్టీ తేజ అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఇక టేస్టీ తేజతో పాటు గౌతమ్ కృష్ణ, నయని పావని, మహబూబ్ దిల్ సే, గంగవ్వ, రోహిణి, హరితేజ, ముక్కు అవినాష్ వంటి వారు ఈ కార్యక్రమంలోకి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.

Share This Article
Exit mobile version