Bigg Boss 8: ఒక్కసారిగా ఓటింగ్ చేంజ్.. టాప్ ప్లేస్‌ లో ఆ లేడీ? నెక్స్ట్ ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే..?…..

3 Min Read

తెలుగులో ఇప్పటి వరకు ప్రసారమైన రియాలిటీ షోలలో ‘బిగ్ బాస్’ చాలా ప్రత్యేకమనే చెప్పాలి. సరికొత్త థీమ్‌తో వచ్చిన ఈ షో తక్కువ టైంలోనే హై రేంజ్ లో ఆడియన్స్ నుంచి ఏ షోకూ సాధ్యం కాని రీతిలో స్పందనను అందుకుంటూ.. సుదీర్ఘ కాలంగా నెంబర్ వన్ ప్లేస్‌లో దూసుకుపోతోంది. అందుకే మిగిలిన భాషలతో పోలిస్తే తెలుగులో ఎక్కువ టీఆర్పీ రేటింగ్‌ను సైతం సంపాదించుకుంది. ఇప్పటికే ఏడు సీజన్లను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో… ఇప్పుడు ఎనిమిదో దానితో వచ్చింది. ముఖ్యంగా ఇందులో ఎన్నో ఆసక్తికరమైన అంశాలు, చాలా సర్‌ప్రైజ్‌లు కనిపిస్తున్నాయి. అలానే ఇప్పుడు సెకండ్ వీక్ ఓటింగ్ కూడా షాకింగ్‌గా సాగుతోంది. ఇక అందుకు సంబంధించిన డీటెయిల్స్ ని ఇప్పుడు చూసేయండి….

బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌ని అన్‌లిమిటెడ్ కాన్సెప్టుతో తీసుకొస్తున్నట్లు చెప్పినప్పటి నుంచే దీని పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే ఇందులో ఎప్పటికప్పుడు కొత్త ట్విస్టులు ఇస్తున్నారు. ఫలితంగా ఈ సీజన్‌ లో ఊహించని మలుపులు కనిపిస్తున్నాయి. దీంతో చూసే ఆడియన్స్ కు వినోదం కూడా బాగానే లభిస్తోంది. తద్వారా ఈ సీజన్ రెస్పాన్స్‌ను రాబడుతోంది. ఇక తాజాగా ప్రసారం అవుతోన్న ఎనిమిదో సీజన్‌లోకి ప్రేరణ కంభం, యష్మి గౌడ, బెజవాడ బేబక్క, కిర్రాక్ సీత, ఢీ ఫేం నైనిక, విష్ణుప్రియ భీమనేని, సోనియా ఆకుల, పృథ్వీ రాజ్, నిఖిల్, నబీల్ అఫ్రిది, ఆదిత్య ఓం, శేఖర్ భాష, నాగ మణికంఠ, అభయ్ నవీన్‌లు కంటెస్టెంట్లుగా ఎంటర్ అయ్యారు. వీళ్లలో ఫస్ట్ వీక్ లోనే బెజవాడ బేబక్క షో నుంచి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.

ఎపిసోడ్స్ ఎలా నడుస్తున్నా 8వ సీజన్ నామినేషన్స్ మాత్రం చాలా గొడవలతో రంజుగా సాగుతున్నాయి. ఇలా సెకండ్ వీక్ లో మరింత ఎక్కువగానే ఇవి కనిపించాయి. ఎంతో రసవత్తరంగా సాగిన ఈ ప్రక్రియలో 8 మంది ఇంటి సభ్యులు నామినేట్ అయ్యారు. వారిలో నిఖిల్, విష్ణుప్రియ భీమనేని, కిర్రాక్ సీత, ఆదిత్య ఓం, నాగ మణికంఠ, పృథ్వీ రాజ్ శెట్టి, శేఖర్ బాషా, నైనిక నామినేట్ అయ్యారు. బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ సెకండ్ వీక్ కి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ మంగళవారం రాత్రి నుంచి స్టార్ట్ అయింది. ఇది మొదటి రెండు రోజులు ఒకలా సాగింది. కానీ, మూడో రోజు మాత్రం ఒక్కసారిగా మారిపోయింది. గత ఎపిసోడ్‌లో విష్ణుప్రియను ఒక గ్యాంగ్ టార్గెట్ చేయడంతో ఆమెకు సానుభూతి పెరిగింది. అందుకు ఫలితంగా అత్యధిక ఓట్లు సాధిస్తూ ఆమె టాప్‌కు చేరుకుంది.

సెకండ్ వీక్ లో జరుగుతున్న ఓటింగ్‌లో విష్ణుప్రియ టాప్ ప్లేస్‌కు చేరుకోవడంతో అప్పటి వరకూ ఫస్ట్ ప్లేస్ లో ఉన్న నిఖిల్ రెండో స్థానానికి పడిపోయాడు. వీళ్ల తర్వాత స్థానాల్లో మాత్రం ఎటువంటి డిఫరెన్స్ లేకుండా ఓటింగ్ కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. నాగ మణికంఠ మూడో స్థానంలో, నైనిక నాలుగో స్థానంలో, శేఖర్ బాషా ఐదో స్థానంలోనే కొనసాగుతోన్నారు. బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ సెకండ్ వీక్ కి సంబంధించి జరుగుతున్న ఓటింగ్‌లో ప్రస్తుతం ఆరో స్థానంలో ఆదిత్య ఓం ఉన్నాడు. అయితే అతడి కంటే తక్కువగా అంటే ఏడు, ఎనిమిది స్థానాల్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్లు అయిన కిర్రాక్ సీత, పృథ్వీ ఉన్నారు. అంటే, ఈ ముగ్గురిలోనే ఈ వారం ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎక్కువగా సీత లేదా ఆదిత్య వెళ్లిపోవచ్చనే టాక్ నడుస్తోంది.

Share This Article
Exit mobile version