Gangavva : గంగవ్వ పరిచయం అవసరం లేని పేరు. ఒక మారుమూల గ్రామంలో సాధారణ జీవితం గడుపుతున్న ఈమె పల్లె జీవనానికి సంబంధించిన వీడియోలను యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేస్తూ యూట్యూబర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. మై విలేజ్ షో అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరిని సందడి చేసిన గంగవ్వ ప్రస్తుతం సెలబ్రెటీగా మారిపోయారు. ఈమె ఏకంగా సినిమాలు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ సెలబ్రిటీగా బిజీ అయ్యారు.
ఇకపోతే ఆరుపదుల వయసులో గంగవ్వ ఇలాంటి సక్సెస్ అందుకోవడం ఎంతోమందికి స్ఫూర్తి అని చెప్పాలి. సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ దృష్టిలో పెట్టుకొని గతంలో బిగ్ బాస్ అవకాశం వచ్చిన సంగతి తెలిసిందే. సీజన్ ఫోర్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్న గంగవ్వ(Gangavva) కొన్ని వారాలపాటు హౌస్ లో కొనసాగారు. అయితే ఆమెకు ఆ వాతావరణం సరిపడక అనారోగ్యానికి గురయ్యారు. దీంతో బిగ్ బాస్ తనని తన ఇష్ట ప్రకారమే హౌస్ నుంచి బయటకు పంపించారు.
Also read : Bigg Boss House Rules : మారిన రూల్…ఇది గమనించారా?
Gangavva Faces Legal Troubles: Police File Case Against Bigg Boss Star
ఇలా నాలుగవ సీజన్లో బిగ్ బాస్ నుంచి బయటకు వెళ్లిపోయిన గంగవ్వ ప్రస్తుతం ఎనిమిదవ సీజన్లో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టి తనదైన స్టైల్ లో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇదిలా ఉండగా బిగ్ బాస్ హౌస్ లో ఉన్న గంగవ్వకు పోలీసులు గట్టి షాక్ ఇచ్చారు. ఈమె పై పోలీస్ కేసు నమోదు అయింది. బిగ్ బాస్ గంగవ్వ యూట్యూబర్ రాజు పై వన్యప్రాణి సంరక్షణ చట్టం(1972) కింద కేసు నమోదు చేశారు.
గతంలో వీళ్లు తమ యూట్యూబ్ ఛానల్లో చిలక జోస్యం చెప్పించారు అయితే అది మూగజీవాలను హింసించడం కిందకే వస్తుందంటూ జంతు సంరక్షణ కార్యకర్త అదులాపురం గౌతమ్ జగిత్యాల అటవీ శాఖకు ఫిర్యాదు చేశారు . ఈ ఫిర్యాదు మేరకు అధికారులు గంగవ్వ అలాగే రాజు పై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో గంగవ్వ కొనసాగుతున్న నేపథ్యంలో ఆమె హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అటవీ శాఖ అధికారులు ఈమెను విచారించనున్నారని తెలుస్తోంది.