Trisha: సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటి త్రిష ఒకరు. ఈమె గతంలో రెండు భాషలలో సినిమాలు చేస్తూ ఓ వెలుగు వెలిగారు. అప్పట్లో ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు అందరి సరసన నటించి మంచి సక్సెస్ అందుకున్నారు. అయితే కొత్త హీరోయిన్స్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తరుణంలో ఈమెకు క్రమక్రమంగా అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.
ఇలా ఇండస్ట్రీకి దూరమైన త్రిష ఇటీవల మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్ అనే సినిమా ద్వారా తిరిగి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో ఈమె నటనకు అందానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. నాలుగు పదుల వయసులో కూడా పాతికేళ్ళ పడుచు పిల్లలా తరగని అందంతో త్రిష కనిపించారు. దీంతో ఈమెకు తిరిగి అవకాశాలు క్యూ కట్టాయి. ప్రస్తుతం ఇండస్ట్రీలో కొనసాగుతున్న కుర్ర హీరోయిన్స్ ని కాదని ఈమెకు సినిమా అవకాశాలు వస్తున్నాయి అంటే ఈమె క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
Also Read : Akhira Nandhan సినీ ఎంట్రీ పై వ్యాఖ్యలు చేసిన మెగా డాటర్..
ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఎంతో బిజీగా గడుపుతున్న త్రిష గురించి ఒక వార్త వైరల్ గా మారింది. ఈమెకు చెన్నైలో ఉన్నటువంటి ఒక ఇంటిని సీనియర్ స్టార్ హీరో భానుచందర్ కు అమ్మేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో భానుచందర్ వెల్లడించారు. ఈ ఇల్లు త్రిషది అని కొన్ని సంవత్సరాల క్రితం తాను ఎనిమిది కోట్ల రూపాయలకు కొనుగోలు చేశానని తెలిపారు. ఇలా ఈ ఇంటిని కొనుగోలు చేసిన తర్వాత నా భార్య ఈ ఇంటిని మరింత చక్కగా అందంగా తీర్చిదిద్దని భానుచందర్ వెల్లడించారు.
ఈ విధంగా త్రిష తన ఇంటిని భానుచందర్ కు అమ్మారనే విషయం తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. ఒక్కో సినిమాకు ప్రస్తుతం 10 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకొనే త్రిష ఈ ఇంటిని ఎందుకు అమ్మారు అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక త్రిష ప్రస్తుతం తమిళ సినిమాలతో పాటు తెలుగులో కూడా చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభర సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ అందుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో ఇదివరకే స్టాలిన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తర్వాత మరోసారి విశ్వంభర ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.