Bandla Ganesh : బండ్ల గణేష్ తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ఈయన తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ గా నటుడిగా పలు సినిమాలలో నటించే ప్రేక్షకులను మెప్పించారు. అనంతరం నిర్మాతగా మారి పలువురు స్టార్ హీరోలతో సినిమా చేసి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ఇటీవల కాలంలో బండ్ల గణేష్ పూర్తిగా సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ ఈయన మాత్రం రాజకీయాల పరంగా సినిమాల పరంగా సోషల్ మీడియా వేదికగా తరచూ పోస్టులు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.
ఇక బండ్ల గణేష్(Bandla Ganesh) పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అనే విషయం మనకు తెలిసిందే. ఈయన ఏదైనా కార్యక్రమంలో పాల్గొన్న మైక్ చేత పట్టిన పవన్ కళ్యాణ్ గురించి గొప్పలు చెబుతూ పవన్ కళ్యాణ్ నామస్మరణ చేస్తూ ఉంటారు. అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత బండ్ల గణేష్ కూడా పెద్దగా పవన్ గురించి ఎక్కడ ప్రస్తావించలేదని తెలుస్తోంది. బహుశా పవన్ కళ్యాణ్ బండ్ల గణేష్ ని దూరం పెట్టారా అనే సందేహాలు కూడా అందరిలో కలుగుతున్నాయి.
Also Read : Pawan Kalyan: పవన్ వ్యవహారం మెగా ఫ్యామిలీకి నచ్చలేదా… అందుకే మౌనం వహిస్తున్నారా?
Bandla Ganesh’s Advices Don’t Trust Anyone in Life, They’ll See You as a Beggar!
ఇకపోతే తాజాగా బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదిక వరుస ట్వీట్లు చేయడంతో ఇది కాస్త సంచలనంగా మారాయి. ఇక ఈయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. జీవితంలో మీరు ఎవరిని నమ్మొద్దు.. మిమ్మల్ని మీరు మాత్రమే నమ్ముకోండి. అలాకాకుండా ఎవరి దగ్గర నుంచి అయినా మనం సహాయం ఆశించామా వాళ్లు మనల్ని ఒక యాచకుల్లా చూస్తారని, జాగ్రత్తగా ఉండండి అంటూ ఈ సందర్భంగా బండ్ల గణేష్ వరుసగా ట్వీట్లు చేశారు.
ఇలా ఈయన పోస్ట్ చేయడంతో ఎవరిని ఉద్దేశించి బండ్ల గణేష్ ఇలాంటి పోస్టులు చేశారు బహుశా ఎవరైనా ఆయనని ఇలా అవమానకరంగా చూశారా? ఈయనకు రాజకీయాల పరంగా ఏదైనా అవమానం జరిగిందా లేకపోతే నిర్మాతగా ఎవరి నుంచి అయినా ఇలాంటి అవమానకర పరిస్థితులను ఎదుర్కొన్నారా అంటూ పలు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.మరి బండ్ల గణేష్ చేసిన ఈ పోస్ట్ ఎవరిని ఉద్దేశించి చేశారు అన్నది తెలియాల్సి ఉంది.